శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని అత్యంత పవిత్రంగా భావించి వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. శాస్త్ర ప్రకారం అష్టలక్ష్ములు, నవధాన్యాలు, సకల సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఆరాధించే ఈ పూజా విధానం, దానికి కావలసిన నియమాల గురించి తెలుసుకుందాం.
పూజకు కావలసిన ముఖ్యమైన సామగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, తమలపాకులు, వక్కలు, కర్పూరం, ధూపం (అగరబత్తులు), కలశం (వెండి, రాగి లేదా ఇత్తడి చెంబు), బియ్యం, పచ్చ కర్పూరం, కొబ్బరికాయ (కలశంపై పెట్టడానికి), తోరణం (9 ముడులు వేసిన పసుపు దారాలు), కొత్త వస్త్రం (కలశానికి చుట్టడానికి పట్టు వస్త్రం/రవికె గుడ్డ),
మామిడాకులు, రంగు రంగుల సువాసనగల పూలు (పద్మాలు/తామర పూలు చాలా శ్రేష్ఠం), నైవేద్యానికి పూర్ణం బూరెలు, పరమాన్నం, దద్దోజనం, చక్రపొంగలి, పులిహోర, పండ్లు.
శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎందుకు జరుపుకుంటారు? ఉపయోగాలేంటి?
వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజే (గురువారం) ఇల్లు శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటి ముందర బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. పూజా మండపాన్ని మామిడాకులు, పూలతో అందంగా అలంకరించాలి. ఏ పూజ ప్రారంభించినా విఘ్నాలు తొలగడానికి ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి. పసుపుతో వినాయకుడిని చేసి, పసుపు గణపతికి అర్చన చేసి, చిన్న నైవేద్యం (బెల్లం ముక్క) సమర్పించాలి. వరలక్ష్మీ వ్రతంలో అత్యంత కీలకమైనది కలశం. పూజా పీఠంపై బియ్యం పరిచి, దానిపై రాగి లేదా వెండి చెంబును ఉంచాలి. చెంబులో బియ్యం, నాణెం, పసుపు, కుంకుమ, పువ్వులు, పచ్చకర్పూరం వేయాలి. కలశం మూతిపై మామిడాకులను అమర్చి, పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన కొబ్బరికాయను ఉంచాలి. కలశానికి అమ్మవారి ముఖపద్మం లేదా చీరతో అమ్మవారి రూపంలో అలంకరించాలి. ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం వంటి షోడశోపచార పూజలు సమర్పించాలి. వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి (108 నామాలు) చదువుతూ పత్రాలు, పూలు, అక్షతలతో అమ్మవారిని పూజించాలి. 9 ముడులు (గ్రంథులు) ఉన్న పసుపు దారానికి (తోరణం) పూజ చేసి అమ్మవారి వద్ద ఉంచాలి. ఆ తర్వాత దాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పిండివంటలను (ముఖ్యంగా బూరెలు, పరమాన్నం) నైవేద్యంగా సమర్పించి, మహా హారతి ఇవ్వాలి. పూజ పూర్తయ్యాక పూజలో ఉంచిన తోరణాన్ని "వరలక్ష్మీ ప్రసన్నాస్తు" అనుకుంటూ ధరించాలి. సాయంత్రం వేళ ముత్తైదువులను (కనీసం ఐదుగురిని) ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పువ్వులు, తోరణంతో కూడిన తాంబూలం ఇచ్చి వారి దీవెనలు తీసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజంతా ఉపవాసం ఉండటం శ్రేష్ఠం. ఆరోగ్యం సహకరించని వారు పలాహారం తీసుకోవచ్చు. తోరణంలో 9 ముడుల ప్రాముఖ్యత ఏంటంటే.. తోరణంలోని 9 ముడులు నవవిధ భక్తులకు (శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం) ప్రతిరూపాలు. శనివారం ఉదయం పునఃపూజ చేసి కలశాన్ని కదిలించి, అందులోని నీటిని ఇల్లంతా చల్లి, మిగిలిన నీటిని పచ్చని మొక్కల్లో పోయాలి. కలశంలోని బియ్యాన్ని పరమాన్నం చేయడానికి ఉపయోగించవచ్చు.శాస్త్రోక్తమైన పూజా విధానం ఇలా చేసుకోవాలి (ఇంటి శుద్ధి)
vastu tips: తూర్పు దిక్కులో ఇల్లు ఉన్నా సమస్యలు వస్తున్నాయా?
ప్రధాన పూజ
శాస్త్రం చెబుతున్న ముఖ్యమైన నియమాలు: