vastu tips: వాస్తు ప్రకారం రాత్రిపూట ఈ 3 పనులు వద్దు.. లక్ష్మీదేవి దూరమవుతుంది!

రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతమైన నిద్ర. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టక, ఆందోళనతో రాత్రంతా ఇబ్బంది పడుతుంటారు. దీనికి ఇంటి వాతావరణం, అలవాట్లు కూడా కారణం కావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు కొన్ని వస్తువులను చూడటం లేదా కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ప్రతికూల శక్తులు పెరుగుతాయి. తద్వారా మానసిక అశాంతి, నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. ప్రశాంత నిద్ర కోసం రాత్రివేళ వర్జించాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఇవే!

Advertisement

1. సింక్‌లో మురికి గిన్నెలు వదిలేయకండి

చాలామంది రాత్రి భోజనం ముగిశాక పాత్రలను శుభ్రం చేయకుండా సింక్‌లోనే వదిలేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది అస్సలు మంచిది కాదు. సింక్‌లో ఉండే మురికి పాత్రలు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అంతేకాకుండా రాహు-కేతువుల ప్రభావం పెరుగుతుంది. దీని వల్ల ఉదయాన్నే లేవగానే తల బరువుగా అనిపించడం, మనశ్శాంతి కలగకపోవడం జరుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశముంది. కాబట్టి రాత్రి పడుకునే ముందే వంటగదిని, పాత్రలను శుభ్రం చేసుకోవడం శ్రేయస్కరం.

Advertisement
వాస్తు ప్రకారం.. మనీ మాగ్నెట్ ఈ రన్నింగ్ బుల్ వాల్ పెయింట్

2. రాత్రిపూట అద్దంలో అస్సలు చూడకండి

సాధారణంగా పడకగదిలో అద్దం అమర్చుకోవడం సహజం. అయితే రాత్రి పడుకునే ముందు అద్దంలో ముఖం చూసుకోవడం లేదా మంచానికి ఎదురుగా అద్దం ఉండటం మంచిది కాదు. అద్దం తనలోకి శక్తులను ఆకర్షించి ప్రతిబింబిస్తుంది. రాత్రివేళల్లో చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో అద్దంలో చూసుకుంటే అనవసరమైన భయాలు, మానసిక ఒత్తిడి పెరిగి నిద్రకు భంగం కలుగుతుంది. పడకగదిలో అద్దం ఉంటే రాత్రి నిద్రపోయే సమయంలో దానిపై ఒక గుడ్డను కప్పి ఉంచడం శుభఫలితాలను ఇస్తుంది.

Advertisement
vastu tips: ఇంటికి కాకి వస్తే వాస్తు ప్రకారం ఏం జరుగుతుంది?

3. దిండు పక్కన నీటి సీసా ఉంచకూడదు

రాత్రివేళ దాహం వేస్తుందనే ఉద్దేశంతో చాలామంది దిండు పక్కనే నీళ్ల సీసా పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో నీటిని చంచలత్వానికి ప్రతీకగా చెబుతారు. మనస్సుకు అధిపతి అయిన చంద్రుడికి, నీటికి దగ్గరి సంబంధం ఉంది. దిండుకు అత్యంత సమీపంలో నీటిని ఉంచుకోవడం వల్ల మనస్సు నిలకడగా ఉండక, ఆలోచనలు ఎక్కువై గాఢనిద్రకు దూరమవుతారు. నీళ్లు తాగాలనుకుంటే మంచానికి కొద్దిగా దూరంలో ఉన్న బల్లపై ఉంచుకోవడం మంచిది.

English Summary

Vastu Tips: Avoiding looking in the mirror at night, not leaving dirty dishes in the sink, and not keeping a water bottle next to your pillow helps ensure deep sleep.