మన భారతీయ సంస్కృతిలో ఆహారాన్ని కేవలం ఆకలి తీర్చే వస్తువుగా కాకుండా 'అన్నదాత సుఖీభవ' అంటూ పరబ్రహ్మ స్వరూపంగా పూజిస్తాం. భోజనం చేసే పద్ధతి నుంచి, తిన్న తర్వాత పాటించాల్సిన నియమాల వరకు మన పెద్దలు ఎన్నో ఆచారాలను నిర్దేశించారు. అయితే, నేటి వేగవంతమైన జీవితంలో చాలామంది భోజనం ముగిశాక తిన్న ప్లేట్లోనే చేతులు కడిగేస్తుంటారు. చిన్న విషయమే కదా అని తీసిపారేసే ఈ ఒక్క అలవాటు వెనుక ఎంతటి జ్యోతిష్య రహస్యం, ఆరోగ్య సూత్రం ఉందో తెలుసుకోవడం ఎంతో అవసరం.
జ్యోతిష్యం ప్రకారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్నం లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. భోజనం చేసిన పాత్రలోనే చేతులు కడగడం అంటే ఆహారాన్ని, ధాన్య లక్ష్మిని తీవ్రంగా అవమానించడమే. తిన్న పళ్లెంలో చేతులు కడిగితే ఇంట్లో ఐశ్వర్యం తగ్గిపోతుందని, లక్ష్మీదేవి నిష్క్రమించి అనవసర ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పళ్లెంలో మురికి నీరు చేర్చడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించి పేదరికానికి దారితీస్తుందని విశ్వసిస్తారు.
vastu tips: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం మధ్యలో ఆపొచ్చా?
వాస్తు నిపుణుల విశ్లేషణ ప్రకారం కూడా భోజన పాత్రలను గౌరవంగా, పరిశుభ్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకం. తిన్న ప్లేట్లోనే చేతులు కడగడం వల్ల మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు నీటితో కలసి అపరిశుభ్రతను పెంచుతాయి. ఇది ఇంట వాస్తు దోషాలకు కారణమవుతుంది. అందుకే భోజనం పూర్తయ్యాక ప్లేట్‌ను పక్కన పెట్టి, ప్రత్యేకంగా వాష్ బేసిన్ వద్దకు వెళ్లి చేతులు కడుక్కోవడమే వాస్తు ప్రకారం శుభప్రదం. పూర్వీకుల ఆచారం వెనుక ఒక ప్రయోజనాత్మక సూత్రం కూడా ఉంది. గతంలో లోహ పాత్రలను ఉపయోగించేవారు. తిన్న పళ్లెంలోనే చేతులు కడిగితే ఆ జిడ్డు, మురికి పాత్రకు ఎక్కువగా పట్టుకుని శుభ్రం చేయడం కష్టమయ్యేది. అందుకే ఆ రోజుల్లోనే పెద్దలు ఈ అలవాటును ఒక నియమంగా మార్చారు. కాలక్రమేణా అది మన సంప్రదాయంలో ఒక భాగమైంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తిన్న ప్లేట్లో చేతులు కడగడం వల్ల నేరుగా ఏదో పెద్ద అనారోగ్యం వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, పరిశుభ్రత పరంగా ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. భోజనం చేసిన తర్వాత వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి హ్యాండ్ వాష్‌తో శుభ్రంగా చేతులు కడుక్కోవడం వల్ల క్రిములు తొలగిపోయి ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది. భోజనం ముగించాక ఆహారాన్ని వృథా చేయకపోవడం, తిన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం వల్ల కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. అందువల్ల సంప్రదాయాలను గౌరవిస్తూ, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి ఈ అలవాటును మార్చుకోవడం శ్రేయస్కరం.వాస్తు ప్రకారం
vastu tips: వాస్తు ప్రకారం చీపురు లక్ష్మీదేవితో సమానం.. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి!
వైద్యుల ప్రకారం