vastu tips: బెడ్‌రూంలో ఉండే అద్దానికి వాస్తు ఉంటుంది తెలుసా?

భారతీయ సంప్రదాయంలో గృహ నిర్మాణానికే కాదు, ఇంట్లోని వస్తువుల అమరికకు కూడా వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత మనకు ప్రశాంతతను ఇచ్చేది బెడ్ రూమ్. దాదాపు అందరి బెడ్ రూమ్స్‌లో అద్దం, డ్రస్సింగ్ టేబుల్స్ కామన్‌గా ఉంటాయి. అయితే చాలా మంది తెలియక వాటిని తప్పుడు దిశలలో పెట్టి వాస్తు దోషాలను కొనితెచ్చుకుంటారు. మాస్టర్ బెడ్ రూంలో అద్దం ఎక్కడ ఉండాలి, నేలపై పడుకుంటే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాలను తెలుసుకుందాం.

Advertisement

ఆగ్నేయం ఉత్తమం

బెడ్ రూంలో అద్దం లేదా డ్రస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవడానికి ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలు అత్యంత ఉత్తమమైనవి. అయితే, అద్దాన్ని అమర్చేటప్పుడు మనం పడుకునే మంచం అందులో ప్రతిబింబించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. నిద్రపోతున్నప్పుడు మన శరీరం అద్దంలో కనిపిస్తే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పర్థలకు దారితీస్తుంది. ఒకవేళ స్థలాభావం వల్ల మంచానికి ఎదురుగానే అద్దం పెట్టాల్సి వస్తే, రాత్రి పడుకునే ముందు దానిపై ఒక క్లాత్ కప్పడం మంచి పరిహారం అవుతుంది.

Advertisement

నేలపై పరుపు వేసుకుంటే

ఇక చాలా మంది వేసవి కాలంలోనో లేదా అలవాటు చొప్పునో బెడ్ రూంలో నేలపై పరుపు వేసుకుని పడుకుంటూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం నేలపై పడుకోవడం అస్సలు మంచిది కాదు. భూమిలో నిరంతరం గురుత్వాకర్షణ శక్తితో పాటు ఒక రకమైన అయస్కాంత శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మనం నేరుగా నేలపై పడుకున్నప్పుడు ఈ శక్తి మన శరీరంలోని సానుకూల శక్తిని లాగేసుకుంటుంది. దీనివల్ల శారీరక నొప్పులు, జలుబు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ భూమికి కనీసం కొద్దిగా ఎత్తులో ఉండే మంచం పైనే పడుకోవాలి.

Advertisement

బాక్స్ టైప్ మంచాలు

ప్రస్తుత రోజుల్లో స్టోరేజ్ కోసం చాలా మంది బాక్స్ టైప్ మంచాలను వాడుతున్నారు. కానీ మంచం కింద ఇనుప సామాన్లు, పాత వస్తువులు, చెప్పులు, విరిగిపోయిన వస్తువులను అస్సలు ఉంచకూడదు. మంచం కింద చెత్త లేదా బరువైన వస్తువులను కుక్కి పెట్టడం వల్ల బెడ్ రూంలో ప్రతికూల శక్తి పేరుకుపోతుంది. ఇది నిద్రలేమికి, పీడకలలకు కారణమవుతుంది. కాబట్టి మంచం కింద భాగం ఎప్పుడూ శుభ్రంగా, గాలి ఆడేలా ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. బెడ్ రూమ్ వాస్తులో అన్నింటికంటే ముఖ్యమైనది తల పెట్టి పడుకునే దిశ. పడుకునేటప్పుడు తూర్పు లేదా దక్షిణ దిశ వైపు తల పెట్టి పడుకోవడం ఉత్తమం.

Advertisement

ముఖ్యంగా దక్షిణ దిశ వైపు తల పెట్టి, ఉత్తరం వైపు కాళ్లు చాపి పడుకోవడం వల్ల దీర్ఘాయువు, సంపద, మానసిక ప్రశాంతత లభిస్తాయి. పొరపాటున కూడా ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు. ఉత్తర ధృవంలోని అయస్కాంత శక్తి మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపి నిద్ర పట్టకుండా చేస్తుంది. బెడ్ రూమ్ అనేది కేవలం పడుకునే గది మాత్రమే కాదు, మన జీవితాన్ని రీఛార్జ్ చేసే ప్రదేశం కాబట్టి ఈ చిన్న చిన్న వాస్తు మార్పులు చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

English Summary

Vastu: A mirror positioned near the bed should be located in either the southeast or northwest direction. If space constraints result in a mirror facing the bed while sleeping, it should be covered with a cloth.