vastu tips: వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ముందు ఈ 3 చెట్లు ఉండకుండా చూసుకోండి!

ఇంటి నిర్మాణం, గదుల అమరిక ఎంత ముఖ్యమో.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిసరాల్లో మనం పెంచే చెట్లు, మొక్కలు కూడా అంతే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన పెద్దలు చెప్పేదాన్ని బట్టి, కొన్ని చెట్లు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించి సంతోషాన్ని ఇస్తే, మరికొన్ని చెట్లు ప్రతికూల శక్తిని పెంచి ఆర్థిక, మానసిక ఇబ్బందులకు కారణమవుతాయి. ముఖ్యంగా, ఇంటి గుమ్మం గుండానే లక్ష్మీదేవి, సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు. అందుకే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా అతి దగ్గరగా ఈ 3 చెట్లు ఉండటం అశుభంగా పరిగణిస్తారు.

Advertisement

చింత చెట్టు: మానసిక ఒత్తిళ్లకు కారణం

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా పాత ఇళ్ల వద్ద చింత చెట్లు కనిపిస్తుంటాయి. అయితే వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన దారానికి ఎదురుగా చింత చెట్టు ఉండటం అస్సలు మంచిది కాదు. ఈ చెట్టు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత లోపించడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, విపరీతమైన మానసిక ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Advertisement

అరటి చెట్టు: పవిత్రమే.. కానీ దిశ ముఖ్యం!

హిందూ సంప్రదాయంలో అరటి చెట్టు అత్యంత పూజనీయమైనది. శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించి పూజలు చేస్తాం. అయినప్పటికీ, దీనిని సింహద్వారానికి ఎదురుగా నాటకూడదు. అరటి చెట్టును ప్రధాన ద్వారానికి అడ్డుగా లేదా అత్యంత సమీపంలో నాటితే అది ఇంట్లోకి వచ్చే వెలుతురును, సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. దీనిని ఇంటి ప్రాంగణంలో సరైన ప్రదేశంలో నాటితే శుభఫలితాలు ఇస్తుంది తప్ప, ప్రధాన ప్రవేశ ద్వారాన్ని అడ్డుకునేలా ఉండకూడదు.

మునగ చెట్టు: ఆర్థిక నష్టాలు, పనుల్లో ఆటంకాలు

ఆరోగ్య పరంగా మునగ చెట్టు ఎంతో మేలు చేసినప్పటికీ, వాస్తు పరంగా దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచడం నిషేధం. సింహద్వారం ముందే మునగ చెట్టు ఉంటే చేపట్టిన ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతారు. ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం, అనవసర ఖర్చులు రావడం, కుటుంబంలో తరచూ కలహాలు రావడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ చెట్లు ఉంటే, వాటిని వెంటనే తొలగించడం లేదా వాస్తు నిపుణుల సలహాతో తగిన నివారణ ఉపాయాలు పాటించడం శ్రేయస్కరం.

English Summary

Vastu: Tamarind, drumstick, and banana trees should not be located in front of the main entrance of the house. These can lead to issues such as mental stress and the entry of negative energies. If they are present, remove them immediately.