vastu tips: వ్యాపారంలో నష్టాలొస్తుంటే ఈ వాస్తు చిట్కాను పాటించండి!

పగలు రాత్రి అనకుండా ఎంత కష్టపడి పనిచేస్తున్నా వ్యాపారంలో ఆశించిన లాభాలు రావడం లేదా? కస్టమర్లు రాక, పెరిగిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ప్రశాంతతను దూరం చేస్తున్నాయా? అయితే మీ దుకాణం లేదా ఆఫీసులో వాస్తు దోషాలు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య, వాస్తు పండితులు చెబుతున్నారు. ప్రకృతిలోని పంచభూతాల సమతుల్యత లోపించినప్పుడు వ్యాపారంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ వ్యాపార స్థలంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి, అఖండ విజయాలను అందుకోవచ్చు.

Advertisement

ఉత్తర దిశ: కుబేరుడి స్థానం

వ్యాపార లాభాలను అందించే బుధ గ్రహానికి, సంపద అధిపతి అయిన కుబేరుడికి ఉత్తర దిశ నిలయం. ఈ దిశలో అగ్ని సంబంధిత వస్తువులైన నూనె, నెయ్యి, కర్పూరం, అగర్బత్తీలు అస్సలు ఉంచకూడదు. ఈ ప్రాంతంలో ఎరుపు రంగు వస్తువులు పెట్టడం కానీ, గోడలకు ఎరుపు రంగు వేయడం కానీ చేయకూడదు. ఈ స్థలాన్ని గదిలా మూసివేయకుండా వీలైనంత ఓపెన్‌గా ఉంచాలి. బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు వస్తువులను ఇక్కడ ఉంచడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి.

Advertisement

ఆఫీసు ప్రవేశ ద్వారం, క్యాష్ కౌంటర్

వ్యాపార స్థలం ప్రధాన ద్వారం వాయువ్యం, ఈశాన్యం లేదా ఉత్తర దిక్కుల్లో ఉండటం శ్రేయస్కరం. ప్రవేశ ద్వారాన్ని రకరకాల భారీ అలంకార వస్తువులతో నింపేయకూడదు. ఇది లోపలికి వచ్చే లక్ష్మీ కటాక్షాన్ని, కొత్త వ్యాపార అవకాశాలను అడ్డుకుంటుంది. ఎంట్రన్స్ ఎప్పుడూ ఖాళీగా, ప్రశాంతంగా ఉండాలి. మీ ప్రధాన ద్వారం ఏ దిక్కున ఉన్నప్పటికీ, మీ షాపులోని క్యాష్ కౌంటర్ మాత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే ఉండేలా చూసుకోవాలి.

యజమాని కూర్చునే సీటు

షాపు యజమాని కూర్చునే స్థానం వ్యాపార గమనాన్ని మారుస్తుంది. యజమాని ఎల్లప్పుడూ నైరుతి దిశలో కూర్చుని, ఉత్తర ముఖంగా చూసేలా తన సీటును అమర్చుకోవాలి. మీ సీటు వెనుక భాగంలో దేవుడి పటాలు, విగ్రహాలు లేదా పూజా మందిరం ఉండకూడదు. మీ వెనుక ఎప్పుడూ ఒక సాదా, బలమైన గోడ మాత్రమే ఉండాలి.

Advertisement

దేవుడి పటాలు, నరఘోష యంత్రాలు

బాగా నడుస్తున్న వ్యాపారం ఒక్కసారిగా కుదేలైనా, రావాల్సిన బకాయిలు నిలిచిపోయినా దానికి 'నరఘోష' లేదా దిష్టి తగలడమే కారణం కావచ్చు. షాపులో దేవుడి పటాలను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. వాటిని కేవలం ఈశాన్యం లేదా తూర్పు దిశలో మాత్రమే ప్రతిష్టించాలి. నరఘోష నివారణకు పూజా స్థలంలో నరఘోష యంత్రం, ఆకర్షణ యంత్రాన్ని ఉంచి, నిత్యం ఉదయం, సాయంత్రం ధూపదీపాలు నైవేద్యాలు సమర్పించాలి.

గోడల రంగులు

షాపులోని వాతావరణం కస్టమర్లను ఆకర్షించేలా ఉండాలి. అందుకే గోడలకు డార్క్ కలర్స్ కాకుండా.. మనసుకు ఆహ్లాదాన్ని, సానుకూలతను ఇచ్చే తెలుపు, లేత నీలం, బూడిద , క్రీమ్ కలర్ వంటి ప్రకాశవంతమైన లేత రంగులను ఎంచుకోవాలి.

Advertisement

వ్యాపారాభివృద్ధికి శ్వేతార్క్ గణపతి, మెటల్ తాబేలు

దుకాణంలో జిల్లేడు వేరుతో చేసిన 'శ్వేతార్క్ గణపతి' చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచి, రోజు ధూపం వేయాలి. వారానికి ఒకసారి కొబ్బరికాయ కొట్టి, పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి, అక్కడ పనిచేసే వర్కర్లకు, కస్టమర్లకు పంచడం వల్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. మీరు కూర్చునే టేబుల్‌పై మీ ముఖానికి ఎదురుగా ఒక మెటల్ తాబేలును ఉంచండి. ఇది కస్టమర్ల తాకిడిని పెంచడమే కాకుండా, మార్కెట్లో ఆగిపోయిన పాత బకాయిలు త్వరగా వసూలయ్యేలా చేస్తుంది.

English Summary

Vastu: At the place of business, the owner should sit in the southwest direction and face north. Place a 'Shwetark Ganapati' and a metal tortoise on the desk; this will bring profits.