Vastu tips: తీవ్రమైన వాస్తుదోషాలు ఉంటే వచ్చే సమస్యలివే; అందుకే వాస్తుదోషాలను లైట్ తీసుకోకండి!!


మనం ఊహించని విధంగా నిత్యం అనుభవించే సమస్యలకు, ఇంటి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా? మన ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నాయని గుర్తించడం ఎలా? వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి? అసలు ఎలాంటి సమస్యలను వాస్తు దోషాలు ఉన్న ఇంటికి వచ్చే సమస్యలుగా గుర్తించాలి? వంటి అనేక వివరాలు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Vastu tips: ధనవంతులు కావాలని కలలు కంటున్నారా? అయితే ఇంట్లో ఈ వాస్తుమార్పులు చేసుకోండి!!

తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు... అప్పుల బాధలు


వాస్తు దోషాలు అన్ని ఇళ్లలోనూ ఒకే విధంగా ఉండవని, ఇంట్లో ఉండే దోషాలను బట్టి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క విధంగా ఉంటాయని చెబుతున్నారు. ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉండి, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండి, మానసిక ప్రశాంతతతో కూడిన జీవనం సాగిస్తూ ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషాలు లేవని నమ్మాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక సంపాదించిన రూపాయి నిలవకపోవడం, అప్పులు చేయడం, విపరీతంగా అప్పులు ఎక్కువ కావడం, ఆ అప్పులు తీర్చడం కోసం మళ్లీ మళ్లీ అప్పులు చేయడం ఇలా ఆర్థికంగా చితికి పోవడం వంటి సమస్యలు వాస్తు దోషాల వల్ల వస్తాయని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలకు మూల కారణమైన ఉత్తర దిక్కున ఉండే దోషాలు తొలగిస్తే కొంతమేరకు ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

Advertisement
టెన్షన్, సూసైడ్స్.. ఘర్షణలు, మానసిక క్షోభ


ఇక తీవ్రంగా కుంగిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నాలు చెయ్యటం, టెన్షన్ పడడం, మానసికంగా క్షోభకు గురి కావడం, తీరని వ్యధ, ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాకుండా నిత్యం కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య ఘర్షణలు, పిల్లలకు విద్య సరిగ్గా రాకపోవడం, వారు సక్రమంగా ప్రవర్తించక పోవడం, పిల్లలు సరిగా ఎదగకపోవడం, పుట్టకపోవడం, మరణించడం, అంగవైకల్యం రావడం ఇలాంటి సమస్యలు కూడా వాస్తు దోషాల కారణంగా వచ్చే సమస్యలుగా చెప్తున్నారు. ముఖ్యంగా దక్షిణ దిశలో తీవ్రమైన వాస్తు దోషాలు ఉంటే ఇటువంటి సమస్యలు వేధిస్తాయి అని, కాబట్టి దక్షిణ దిశలో వాస్తు దోషాలను తొలగిస్తే కొంతమేర ఉపశమనం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

రోగాలు, నిత్యం భయం, మర్డర్ లు.. చట్ట వ్యతిరేక పనులు


అంతేకాదు నిత్యం రోగాలతో బాధ పడటం, వ్యాపారాలు సరిగ్గా జరగకపోవడం, పెట్టుబడిపై కనీస వడ్డీ కూడా రాకపోవడం, భాగస్వాముల మధ్య నిత్యం ఘర్షణలు, అవమానాలు, భయంభయంగా ఉండటం, బికారులు గా మారడం, సన్యాసం పుచ్చుకోవడం, పిచ్చి పట్టడం, చెయ్యకూడని పనులు చేయడం, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వ్యభిచారం చేయడం, ఇతర స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ప్రదర్శించడం, దాడులు చేసుకోవడం, మర్డర్ లు చేయడం వాస్తు దోషాల కారణంగా సంభవించే అనర్ధాలు అని చెబుతున్నారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ వాస్తు దోషాలు ఉన్నాయో వాటిని సరి చేసుకుంటే ఈ బాధలనుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.

దొంగతనాలు, అగ్నిప్రమాదాలు.. ప్రేమ పేరుతో చెయ్యకూడని పనులు


ఇక దొంగతనాలు చేయడం, అగ్ని ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు లభించకపోవడం విదేశాలకు వెళ్లాలన్నా వెళ్ళలేక పోవడం, ప్రేమ పేరుతో లేచిపోవడం, పెళ్లయిన తర్వాత పూర్వ ప్రేమికుల తో సంబంధాలు పెట్టుకోవడం, అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవించడం, చర్మ వ్యాధులు రావడం ఇలా ప్రతి ఒక్క దాని వెనుక వాస్తు దోషాలు కారణాలుగా ఉండే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకునేటప్పుడు, గృహ వాస్తు సమగ్రంగా సరిచూసుకొని నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. గృహానికి మంచి వాస్తు ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు సంతోషంగా జీవిస్తారని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English Summary

Experts in Vastu Shastra say that if there are severe Vastu Doshas, serious problems will arise for the family members in the house, so Vastu Doshas should not be taken lightly.