vastu tips: వంటగదిలో వాడే పెనంకు కూడా వాస్తు ఉందంటే ఆశ్చర్యపోతారు


వంటగది అనేది కేవలం రుచికరమైన వంటలు చేసుకునే స్థలమే కాదు.. ఒక కుటుంబం ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సుకు మూలకేంద్రం. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్టమైన ప్రాధాన్యత, శక్తి ఉంటాయి. ఈ నేపథ్యంలో, నిత్యం మనం ఉపయోగించే 'పెనం' విషయంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలు, సాంప్రదాయ విశ్వాసాల గురించి తెలుసుకుందాం.

Advertisement

వాస్తు నమ్మకాల ప్రకారం, వంటగదిలోని పెనంను 'రాహు' గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల దీనిని ఉంచే విధానం, ఉపయోగించే పద్ధతి ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. అయితే ఇవి శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు కాకపోయినప్పటికీ, అనాదిగా వస్తున్న నమ్మకాల ఆధారంగా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

Advertisement
vastu tips: ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించండి.. లక్ష్మీదేవి నడిచొస్తుంది

వంట పూర్తయిన వెంటనే శుభ్రం చేయాలి

చాలామంది వంట చేసిన తర్వాత పెనంను అలాగే మురికిగా వదిలేస్తుంటారు. వాస్తు ప్రకారం పెనంపై మిగిలిపోయిన నూనె, కాలిన ఆహార అవశేషాలు ఎక్కువసేపు ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. అందుకే వంట పూర్తయిన వెంటనే పెనంను శుభ్రం చేసి, ఆరిన తర్వాతే దాని స్థానంలో భద్రపరచాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెనంను కడగకుండా అస్సలు వదిలేయకూడదు.

స్టవ్‌పైనే వదిలేయకండి.. తలకిందులుగా పెట్టొద్దు

ఉపయోగించిన తర్వాత పెనంను గ్యాస్ స్టవ్‌పైనే అలాగే ఉంచే అలవాటు చాలా ఇళ్లలో ఉంటుంది. ఖాళీ స్టవ్‌పై పెనం ఉంచడం సరైన పద్ధతి కాదని, దానిని పక్కకు తీసి ప్రత్యేక స్థానంలో ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతారు. అలాగే, వంట చేసేటప్పుడు పెనంను కుడివైపున ఉంచడం శుభప్రదం. స్థలం ఆదా అవుతుందని లేదా అలవాటు కొద్దీ పెనంను బోర్లించడం అస్సలు మంచిది కాదు, ఇది వాస్తు దోషాలకు కారణమవుతుంది.

Advertisement
vastu tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు ఉండొచ్చా?

వేడి పెనంపై నీళ్లు పోయొద్దు

వంట కాగానే వేడిగా ఉన్న పెనంపై వెంటనే చల్లటి నీళ్లు పోయడం చాలామంది చేస్తుంటారు. అలా చేసినప్పుడు వచ్చే 'చిటపట' శబ్దం వాస్తు పరంగా అశుభంగా భావిస్తారు. అంతేకాదు, తీవ్రమైన వేడిపై అకస్మాత్తుగా చల్లటి నీరు పడటం వల్ల పెనం త్వరగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పెనం కాస్త చల్లారిన తర్వాతే కడగాలి.

చిటికెడు ఉప్పుతో సానుకూలత

అనేక కుటుంబాల్లో ఇప్పటికీ ఒక సంప్రదాయం నడుస్తోంది. ఉదయం పూట మొదటిసారి రొట్టెలు లేదా దోశలు వేసే ముందు, వేడెక్కిన పెనంపై చిటికెడు ఉప్పు చల్లుతారు. ఇలా చేయడం వల్ల వంటగదిలోని ప్రతికూలతలు తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. ఆ ఉప్పును తుడిచేసిన తర్వాతే వంట ప్రారంభించాలి.

English Summary

Vastu guidelines even for the pan used in the kitchen. It should not be placed upside down. Also, cold water should not be splashed on it immediately; instead, a little salt should be sprinkled on it first