శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్న 116 ఏళ్ల బామ్మ..!!

తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఓ బామ్మ కాలినడకన కొండ ఎక్కటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఏ మాత్రం అలసట లేకుండా 3,550 మెట్లు ఉన్న ఈ మార్గాన్ని ఎవరి సహాయం తీసుకోకుండా, చేతిలో కేవలం ఒక కర్రను ఆసరాగా పట్టుకుని, గోవిందా... గోవిందా... అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తిరుమల చేరుకున్నారు. ఇప్పుడు ఈ బామ్మ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన లక్ష్మవ్వ శతాధిక వృద్ధురాలు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 116 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఈ బామ్మ ఆమె మనోబలం, దైవభక్తిని చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. "భక్తి ఉంటే వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ నిరూపించారు", "ఆమె సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకం" అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇంత వయస్సులోనూ శ్రీవారి పైన భక్తితో ఆమె తిరుమల అలిపిరి కాలినడక మార్గాన్ని ఎంచుకున్నారు. సుమారు 3,550 మెట్లు ఉన్న ఈ మార్గాన్ని గోవిందా... గోవిందా... అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తిరుమల చేరుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియో లో వైరల్ అవుతోంది.

Advertisement

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనను చూసిన పలువురు భక్తులు, ఇంత వృద్ధాప్యంలోనూ ఆమెకు లభించిన శారీరక, మానసిక శక్తి శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహమేనని తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఆమె సంకల్పం, జీవనశైలి, మానసిక దృఢత్వమే కారణంగా భక్తులు చెబుతున్నారు. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం, భక్తి చూసిన సహయాత్రికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనను చూసిన పలువురు భక్తులు, ఇంత వృద్ధాప్యంలోనూ ఆమెకు లభించిన శారీరక, మానసిక శక్తి శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహమేనని తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, 116 ఏళ్ల వయస్సులో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల చేరిన భీమవ్వ ప్రయాణం ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ను చూసిన నెటిజెన్లు అభినందిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు.

English Summary

116-year-old woman inspired devotees by climbing the Tirumala steps to seek the blessings of Lord Venkateswara, showcasing remarkable faith