వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలిగా సోషల్ మీడియా వేదికగా నిత్యం వార్తల్లో నిలిచే వివాదాస్పద నటి శ్రీరెడ్డి, ఈసారి ఏకంగా వైసీపీ అధిష్టానంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పరివారాన్ని, పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తూ ఓ ఫేస్‌బుక్ లైవ్‌లో నిప్పులు చెరిగారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రత్యర్థుల దాడులను తట్టుకుని ప్రాణాలకు తెగించి మద్దతుగా నిలిచిన తమ లాంటి వారికి తగిన విలువ ఇవ్వకుండా, చివరి నిమిషంలో వచ్చిన వారికి పీఠాలు వేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి కార్యాలయం సాక్షిగా జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ, తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని బహిరంగంగా సవాల్ విసిరారు.
యాంకర్ శ్యామల ఎంట్రీని తీవ్రంగా తప్పుపట్టిన శ్రీరెడ్డి, ఆమెపై పలు విస్ఫోటక ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు 'సిద్ధం' వేదికలపై ప్రత్యక్షమైన శ్యామలకు పార్టీలో అంత ప్రాధాన్యత ఏ రకంగా ఇస్తారంటూ ప్రశ్నించారు. "డబ్బులు ఇస్తేనే సభలకు వస్తానని కండిషన్లు పెట్టి, రకరకాల వివాదాల్లో ఇరుక్కున్న వారికి జగన్ గారు స్వయంగా స్వాగతం పలికి ఫోటోలకు పోజులిస్తున్నారు" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి రోజా వంటి సీనియర్ నేతల పక్కన శ్యామలను ఈక్వల్ స్టేటస్‌లో కూర్చోబెట్టడం చూస్తుంటే, పార్టీ కోసం మొదటి నుంచి పోరాడిన తమను కావాలనే కార్నర్ చేసి తొక్కిపెడుతున్నారనే విషయం స్పష్టమవుతోందని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం పనిచేయడం వల్ల తనకు ఎదురైన వ్యక్తిగత, ఆర్థిక నష్టాలను శ్రీరెడ్డి భావోద్వేగంతో వెల్లడించారు. వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం వల్లే తన యూట్యూబ్ ఛానెళ్లపై వరుసగా రిపోర్టులు కొట్టించి ఆదాయాన్ని దెబ్బతీశారని, చివరకు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా బెదిరింపులు ఎదుర్కొన్నానని వాపోయారు. ఆరోగ్యం దెబ్బతిని కష్టాల్లో ఉన్న సమయంలో, తాను పార్టీ నేతల దగ్గర డబ్బులు అడిగానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్యామలకు సంబంధించిన పర్సనల్ సమాచారం తన దగ్గర ఉందని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన పేరు చెప్పుకుని యూట్యూబ్‌లో లబ్ధి పొందుతున్న జర్నలిస్ట్ సాయి వంటి వారిని కూడా శ్రీరెడ్డి వదల్లేదు. తనను విమర్శిస్తూ, తన పేరుతో వీడియోలు చేసుకుంటూ ఆర్థికంగా వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేస్తే, చివరికి తనకు దక్కింది అవమానాలు, ఆర్థిక నష్టాలేనని శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ హల్‌చల్..! భార్యతో కలిసి..!
అనారోగ్యంలోనూ నిందలు.. బ్లాక్ మెయిల్ ఆధారాలు!
జగనన్నా క్షమించు-ప్లీజ్ లోకేష్ అన్నా వదిలేయ్-శ్రీరెడ్డి లేఖల రచ్చ..!
యూట్యూబర్లు, జర్నలిస్టులపైనా ఫైర్!