'భోగాపురం' నుంచి ఏయిరిండియా కొత్త షెడ్యూల్- ఏ నగరానికి ఎప్పుడు..!!

భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్దం అయింది. ప్రధాని మోదీ రేపు(శనివారం) భోగాపురం విమానాశ్రయం ప్రారంభించనున్నారు. ఇందు కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీకి స్వాగతం నుంచి కార్యక్రమం మొత్తం అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించింది. బహిరంగ సభ ఏర్పాటు చేసారు. కాగా, భోగాపురం నుంచి ఏయిర్ ఇండియా విమానాల రాకపోకల షెడ్యూల్ ను ప్రకటించింది.

Advertisement

భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ భోగాపురం ప్రారంభం వేళ.. కొత్త రికార్డులు నెలకొల్పేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 15 వేల మందితో ప్రధానికి ఆహ్వాన సమయంలో ప్రత్యేకంగా 13 వేల మంది గిరిజన కళా కారులతో థింసా నృత్య ప్రదర్శన.. రెండు లక్షల మంది తో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో 20 నిమిషాల పాటు ప్రధానికి స్వాగతం..రోడ్ షో ఉంటాయి. మరో 22 నిమిషాలు.. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రధాని సందర్శన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, భోగాపురం నుంచి ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు నుంచి విశాఖ కేంద్రంగా కమర్షియల్ విమానాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
'భోగాపురం' ప్రారంభం వేళ కొత్త రికార్డులు - ప్రధాని మోదీ కోసం ఇలా..!!

ఘనంగా ప్రారంభోత్సవం

17వ తేదీ అర్ద్రరాత్రి సింగపూర్ నుంచి తొలి విమానం భోగాపురం రానుంది. అదే విమానం తొలి గా భోగాపురం నుంచి సింగపూర్ కు వెళ్లనుంది. ఇక.. ఏయిర్ ఇండియా ఆగస్టు 17 నుంచి భోగాపురం - హైదారాబాద్ మధ్య రోజూ రెండు సర్వీసులు ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో నడపనున్నట్లు వెల్లడించింది. ఇక, భోగాపురం - విజయవాడ మధ్య ప్రతీ రోజు నాలుగు సర్వీసులు కొనసాగించనున్నారు. భోగాపురం - బెంగళూరు మధ్య ప్రతీ రోజు మూడు సర్వీసులు వారంలో ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో కొనసాగనున్నాయి. ఆగస్టు 17వ తేదీ నుంచి విశాఖ విమానాశ్రయంకు రాకపోకలు సాగిస్తున్న అన్ని విమానాలు ఇక భోగాపురం నుంచి కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

English Summary

Air India Announces Schedule for Domestic flights form Bhogapuram air port from August 17 to October 24th