ఏపీ కేబినెట్ భేటీ: ఆ హామీలపై కీలక నిర్ణయం, ముహూర్తం ఫిక్స్..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం తుది కసరత్తు జరుగుతోంది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు.. అసెంబ్లీ సమావేశాలతో పాటుగా ఉద్యోగాల ప్రకటనకు అనుమతి.. అమరావతికి సంబంధించి కీలక ప్రతిపాదనల పైనా ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజకీయంగానూ తాజా పరిణామాల పైన చర్చించి... సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక దిశా నిర్దేశం చేయనున్నారు.

Advertisement

ఏపీ కేబినెట్ ఈ రోజు భేటీ కానుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాల పైన చర్చించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కూటమి పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అక్టోబర్ లో ముందు గా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రు లకు సీఎం చంద్రబాబు టాస్క్ విధించే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఎన్నికల సమయం లో బీసీ రక్షణ చట్టం తెస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ చట్టానికి సంబంధించిన తాజా ముసాయిదాకు న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ హామీ అమలు దిశగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement
డీలిమిటేషన్ పై ఊహించని నిర్ణయం, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్.!!

సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

అదే విధంగా ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైనా కేబినెట్ లో చర్చ చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లోనే బీసీ రక్షణ చట్టం బిల్లును ఆమోదించి.. కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక.. దాదాపు మూడు వేలకు పైగా ఉద్యోగాల కల్పన కు సంబంధించి ఈ రోజు సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గత సమావేశం లోనే ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చినా.. మరింతగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ రోజు సమావేశానికి వాయిదా వేసారు. మరో విడత డీఎస్సీ పైనా నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇక, రాజధాని అమరావతి లో క్వాంటం వ్యాలీ కోసం 2 టవర్ల నిర్మాణ పనులు ఎల్అండ్ టికి అప్పగించే అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు. పీపీపీ మోడల్ లో రోప్ వే ప్రాజెక్టులకు కన్సల్టెంట్.. 'లండన్ ఐ' నమూనా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు అనుమతి పైనా కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇక.. రాజకీయంగానూ మాజీ సీఎం జగన్ పర్యటనలు.. కూటమి నుంచి చేపట్టాల్సిన చర్యల పైన చర్చంచి.. కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

English Summary

AP Cabinet is set to take key decisions regarding local body elections and Assembly elections during today's meeting