AP EAPCET 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇలా - కొత్త ఫీజులు..!!

AP EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ పై కీలక అప్డేట్. ఇప్పటికే దీని పైన ఒక నిర్ణయానికి వచ్చారు. అధికారికంగా త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, ఫార్మసీ & అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈనెల 15 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాల అనుబంధ గుర్తింపులను త్వరలో పూర్తి చేసి కౌన్సిలింగ్ చేపట్టాలని భావిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించడానికి తుది కసరత్తు కొనసాగుతోంది. కౌన్సిలింగ్ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ఇందులో ప్రధానంగా నాలుగు దశలలో ఉంటుంది. ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంటు వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ మరియు ర్యాంక్ ఎంటర్ చేసి కౌన్సిలింగ్ చూసి చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

షెడ్యూల్ -ఫీజులు

కాగా, ఇంజనీరింగ్ కళాశాలకు కనీసం ఫీజు 40 వేల నుంచి 47 వేల వరకు పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం 140 ఇంజినీరింగ్ కళాశాలు కనీస ఫీజు 40,000 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ కళాశాలల ఆదాయం వేయాలను గమనించి రెండు మూడు నెలలలో కొత్త ఫీజులు ఖరారు చేస్తారు. ఈ ఫీజు 2026 -27 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. కౌన్సిలింగ్ కి హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, టెన్త్ & 12th ఇంటర్ మార్క్స్ మెమో, 6th to 12th స్టడీ సర్టిఫికెట్, కొత్తగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల దృవీకరణ పత్రం, EWS సర్టిఫికెట్, TC & ఆధార్ కార్డు తదితర డాక్యుమెంట్ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

English Summary

AP EAPCET 2026 counselling likely to begin on 15th of this month, Candidates who qualified in the exam should keep their documents ready