కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - వైసీపీ దూకుడు కు బ్రేక్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అటు కూటమి.. ఇటు వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా రెండు వైపులా కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. ముందుగా స్థానిక ఎన్నికల పైన రెండు క్యాంపులు గురి పెట్టాయి. లోకల్ ఫైట్ వేళ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల హామీ అమలుకు తుది కసరత్తు చేస్తోంది. వైసీపీ కొత్త వ్యూహాలకు చెక్ పెడుతూ.. నిర్ణయం అమలుకు సమాయత్తం అవుతోంది.

Advertisement

ఏపీలో రాజకీయంగా కూటమి- వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ సైతం పార్టీ నేతలకు ఇప్పటికే స్థానిక ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసారు. కాగా... అటు వైసీపీలోని కాపు నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు బీసీ నేతలు విజయవాడ కేంద్రంగా కీలక సభకు నిర్ణయించారు. ఇదే సమయంలో కూటమి అప్రమత్తం అయింది. అందులో భాగంగా 2024 ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ అమలు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయం లో బీసీ రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగా రాష్ట్రంలోని 138 వెనుకబడిన తరగతుల కులాల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు బీసీ చట్టం రూపొందించింది.

Advertisement
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!

కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయంతో

ఈ చట్టాన్ని పరీశీలించిన న్యాయ శాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు బిల్లును ఆమోదించనున్నారు. ఈ బిల్లు ద్వారా బీసీ లపైన 15 రకాల వేధింపుల కు శిక్షలు ఖరారు చేసారు. శాసనసభలో ఆమోదం తరువాత ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో పాటు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు కూడా నివేదించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పించే కీలక చర్యగా దీనిని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా జాతీయ బీసీ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దీని ద్వారా బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టాలని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో.. రెండు వైపుల నుంచి చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు మరింత ఆసక్తి కరంగా మారుతున్నాయి.

English Summary

AP government is taking major steps to provide stronger legal protection for the rights and welfare of Backward Classes