‘తల్లికి వందనం’కు మరో చాన్స్ - చివరి అవకాశం, ప్రభుత్వ తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధుల పైన బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రతీ ఏటా అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ 13 వేలు జమ చేస్తోంది. ఈ ఏడాది నిధులను విడుదల చేసింది. అయితే, అర్హత ఉండీ నిధులు అందని తల్లులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. దరఖాస్తుకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది.

Advertisement

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పైన కీలక అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రెండో సారి తల్లికి వందనం నిధులను అర్హుల ఖాతాల్లో జమ చేసింది. కాగా, నిధులు జమ కాని అర్హులైన లబ్ది దారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15వేలు జమ చేస్తుండగా.. తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున జమ చేస్తోంది. ఇప్పటికే 2026-27 విద్యా సంవత్సరంకు చెందిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. అయితే, పథకంకు అర్హత ఉన్నా డబ్బులు పడని వారికి, కొత్త వారికి ప్రభుత్వం అభ్యంతరాలను దాఖలు చేసేందుకు మరోసారి గడువు పొడిగింది.

Advertisement
ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన, హిట్ లిస్టులో అయిదుగురు - వీరికి ఛాన్స్..ముహూర్తం..!?

ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు ఉండీ.. నిధులు జమ కాని లబ్దిదారులు తమ అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 3తో ముగియగా దాన్ని ఈనెల 7వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోతే శుక్రవారంలోపు స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. అలాగే బ్యాంకు ఖాతా NPCIకి లింక్ అయిందో లేదో సరిచూసుకోవాలి. ప్రభుత్వం ఫిర్యాదులను పరిశీలించి డబ్బులు జమ చేయనుంది. కాగా.. ఇప్పటికే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శించారు. అర్హులు ఉంటే అందుకు అవసరమైన సమాచారంతో వినతుల సమర్పణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ది దారుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి కొత్తగా అర్హులను గుర్తించి జాబితా తయారు చేసి.. వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

English Summary

AP Govt extends the time for complaints and re verification of Thalli ki Vandanam beneficiaries up to 7th August