ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు రుషికొండ భవనాల వినియోగం పైన తుది నిర్ణయానికి వచ్చింది. ఎలా వినియోగించాలో డిసైడ్ అయింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద అప్పగించాలని తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ఏపీటీడీసీ ప్రకటన జారీ చేసింది. దీని ద్వారా రుషికొండ భవనాలు లీజుకు ఇవ్వనున్నారు. మంత్రివర్గ ఉప సంఘం వరుస సమావేశాల తరువాత ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల మేరకు ప్రయివేటుకు ఇవ్వాలని నిర్ణయించారు.
కూటమి ప్రభుత్వం రుషికొండ భవనాలను ప్రయివేటుకు లీజుకు ఇవ్వాలని డిసైడ్ అయింది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా వినియోగం తీసుకురావాలనే అంశం పైన గత రెండేళ్ల కాలంగా తర్జన భర్జన జరిగింది. ఇదే అంశం పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం అనేక ప్రతిపాదనలు.. సాధ్యాసాధ్యాల పైన చర్చించింది. అభిప్రాయ సేకరణ చేసింది. భవనాలను సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ తో పాటుగా కూటమి నేతలు నేరు గా సందర్శించారు. భవనాలు వినియోగంలో లేకపోయినా నిర్వహణా వ్యయం భారంగా మారటం తో మంత్రివర్గ ఉప సంఘం ప్రయివేటుకు లీజుకు ఇవ్వాలని చేసిన సిఫారసు మేరకు తాజాగా ప్రకటన చేసారు. అందులో భాగంగా రుషికొండపై 9.8 ఎకరాల్లోని అయిదు బ్లాకుల్లో నిర్మాణాలను అప్పగించనున్నారు.
అందులో భాగంగా ఉద్యానవనాలు, అంతర్గత రహదారులు, నడక దారులు, పార్కింగ్ తో పాటు అన్ని వసతులతో భవనాలు సిద్దంగా ఉన్నాయని ప్రకటనలో వివరించారు. అదే విధంగా ఈ భవనాలతో పాటుగా 1200 చదరపు మీటర్ల ఖాళీ స్థలాలు ఉన్నాయని.. అందులో 4,800 చదరపు మీటర్లలో జీ+1 భవనాలు నిర్మాణం చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తి ఉన్న సంస్థలు ఈ నెల 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసారు. కాగా, ఈ భవనాల నిర్వహణ కు తాజ్, అట్మాస్మియర్ కోర్, లీలీ, ఫఎమా వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చి.. భవనాల ను పరిశీలన చేసాయి. అయితే, అదనపు గదుల నిర్మాణానికి సీఆర్జెడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఇక, ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మేరకు ముందుకు వచ్చే సంస్థలకు రుషికొండ భవనాలను అప్పగించనున్నారు.ఏపీటీడీసీ ప్రకటన.. 10వ తేదీ గడువు