తక్కువ ధరకే బియ్యం, ప్రత్యేక కౌంటర్లు - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ మార్కెట్ లో బియ్యం ధరలు భారీగా పెరగటంతో.. సామాన్యులకు రిలీఫ్ ఇచ్చేలా కొత్త విధానం అమలు చేయనుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో తక్కువ ధరలకే బియ్యం అమ్మకాలు ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు అందుబాటులో ఉండే వైరైటీలు.. ధరలను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అమ్మకాల ప్రారంభం ముహూర్తం ఖరారైంది.

Advertisement

ఏపీ ప్రభుత్వం బియ్యం తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో.. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గురువారం రాష్ట్ర సచివాలయంలో రైస్‌ మిల్లర్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని విక్రయించేలా ప్రభుత్వానికి సహకరిస్తామని ఆయనకు మిల్లర్లు హామీ ఇచ్చారు. బీపీటీ, కేఎన్‌ఎమ్‌ స్టీమ్‌ రైస్‌ కేజీ రూ.52, ముడి బియ్యం కేజీ రూ.50 చొప్పున విక్రయించాలని ధరలను ఖరారు చేసారు.

Advertisement
విజయవాడ మీదుగా బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, ముహూర్తం ఫిక్స్..!!

ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం

రాష్ట్రంలో బియ్యం ధరలను అదుపు చేసే చర్యల్లో భాగంగా మంత్రి మనోహర్ కీలక సూచనలు చేసారు. ప్రతి నెలా ధరల్లో మార్పులు రావడం, మార్కెట్‌లో సూపర్ ఫైన్ బియ్యం అరవై రూపాయలకు పైగా పెంచి అమ్మకాలు చేస్తుండటం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇలా ధరలు పెరగటం సామాన్యుల పై భారం చూపుతుందని భావించిన ప్రభుత్వం.. తక్కువ ధరలకే అమ్మకం జరిగేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. అందులో భాగంగా ముందుగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తేవటం.. క్రమేనా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, మరో 500 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

English Summary

AP Govt decided to selling quality rice at subsidised prices through 130 Rythu Bazaars and around 500 special counters across the state