బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రాంతంలో వాతావరణం అల్లకల్లోలంగా మారనుందని, ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నిన్నటి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగిన అల్పపీడనం.. ఈ రోజు (జూలై 5, 2026) ఉదయం 08:30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కి.మీ, చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో పాటు నైరుతి రుతుపవన ద్రోణి, షియర్ జోన్ (గాలుల కోత) కూడా బలంగా కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
నడి సముద్రంలో ఏడుగురు జాలర్లు గల్లంతు.. అల్పపీడన గండం! రుతుపవనాల విశ్వరూపం.. విస్తరించిన భారీ వర్షపు మేఘాల వరుస! ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండరాదని, బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని వాతావరణ కేంద్రం సంచాలకులు హెచ్చరించారు. ముసరు వాతావరణం, ఈదురు గాలుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రాబోయే మూడు రోజుల పాటు ప్రాంతాల వారీగా వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి:
1. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
2. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
3. రాయలసీమ:
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!