నైరుతి రుతుపవనాల సందడి మందగించిన ప్రస్తుత పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ ఉపశమనాన్ని కలిగిస్తోంది. దీనివల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల కొంతమేర ఉపశమనం లభిస్తోంది.
ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం, దీనితో పాటు ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం.. వాయుగుండంగా కూడా బలపడింది.
దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల తేలికపాటి పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ వెల్లడించింది. వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. నేడు పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవల వినియోగం సురక్షితం కాదని సూచించారు. అకస్మాత్తుగా వర్షం కురిసేటప్పుడు పిడుగుల ముప్పు పొంచి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలలో పనులు చేసే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడుతున్నప్పుడు లేదా మేఘాలు గర్జిస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో గానీ నిల్చోకూడదని చెప్పారు.వాస్తు ప్రకారం.. మనీ మాగ్నెట్ ఈ రన్నింగ్ బుల్ వాల్ పెయింట్