భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్దమైంది. ప్రధాని మోదీ ఈ రోజు కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని ఘనం గా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. రికార్డు స్థాయిలో స్వాగత ఏర్పాట్లు సిద్దం అయ్యాయి. భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అరుదైన ఆతిథ్యం కల్పించింది.
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై ప్రధాని ఆసక్తికర పోస్ట్, చంద్రబాబు ఇంట్రెస్టింగ్ రిప్లై!
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'థింసా' నృత్య ప్రదర్శనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రధాని మోదీకి ఆహ్వానం నుంచి బహిరంగ సభ వరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. ఇక, నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అరుదైన గుర్తింపును ఇచ్చింది. ప్రధానమంత్రి ఆశీనులయ్యే సభావేదికకు అతి సమీపంలోనే ఎదురుగా వీవీఐపీలకు ఏర్పాటు చేసిన గ్యాలరీలో రైతులకు అరుదైన గౌరవం ఇచ్చారు. దీంతో, వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది.
'భోగాపురం' నుంచి ఏయిరిండియా కొత్త షెడ్యూల్- ఏ నగరానికి ఎప్పుడు..!!
విమానాశ్రయం కోసం గూడెపువలస, కంచేరు, కవులువాడ, ఎ.రావివలస, రావాడ, సవరవిల్లి, ముంజేరు గ్రామాలకు చెందిన రైతులు ఈ ప్రాజెక్ట్ కోసం స్వచ్ఛందంగా భూములిచ్చారు. వీరికి పేరు పేరునా ఆహ్వానం పలికారు. అదే విధంగా తొలి సారి ఇక్కడ నుంచి ఒక విడత ఉచిత విమానయానం కల్పించాలని నిర్ణయించారు. ఇక.. ప్రధాని రాక తో భారీ బహిరంగ సభ కోసం 36 నియోజకవర్గాల నుంచి మూడు లక్షల మందిని తరలించే విధంగా ప్రణాళికలు సిద్దం చేసారు. భోగాపురం ప్రాంతం మొత్తం ఇప్పటికే సందడిగా మారింది. రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం గురించి సందేశం ఇచ్చారు.