ఇక్కడే ఆనందం: పంట పొలాల్లో నాట్లు వేసిన అఖిలప్రియ దంపతులు


కర్నూలు: ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలయప్రియ తన భర్త భార్గవరామ్‌తో కలిసి వరినాట్లు వేశారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామ సమీపంలో ఉన్న పాములేటి అనే రైతు పొలంలో ఈ నవదంపతులు నాట్లు వేశారు.

ఘనంగా మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం: వరుడు ఎవరో తెలుసా?

ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటిస్తూ.. మంచిచెడ్డలు తెలుసుకున్నారు. ఎంత కూలీ ఇస్తున్నారంటూ ఆరా తీశారు. పొలాల్లో సరదాగా గడిపిన ఫొటోలను అఖిలప్రియ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

చంద్రబాబు పాదాలకు నమస్కారం: ఘనంగా అఖిలప్రియ వెడ్డింగ్ (ఫోటోలు)

ప్రజల మధ్య ఉన్నప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా అఖిలప్రియ చెప్పారు. రైతులు, కూలీలతో మాట్లాడానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు మంత్రి అఖిలప్రియ తెలిపారు. కాగా, ఆగస్టు 29న అఖిలప్రియ, భార్గవ్‌ల వివాహం జరిగిన విషయం తెలిసిందే.

Have a great day!
Read more...

English Summary

Andhra Pradesh minister Bhuma Akhila Priya couple in crop fields.