కేంద్రం ఏపీకి మరో తీపి కబురు చెప్పింది. ఆర్దికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వేళ కేంద్రం నుంచి ఏపీకి రూ 4,597 కోట్లు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా కింద భారీ మొత్తంలో నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.1,09,019 కోట్లు అన్ని రాష్ట్రాలకు అందించగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు కేటాయించారు. సాధారణంగా ప్రతి నెలా పదో తేదీలోపు జరిగే ఈ ప్రక్రియను ఈ సారి కేంద్రం ముందస్తుగానే పూర్తి చేసింది.
కేంద్రం నుంచి రాష్ట్రాలను రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలకు ఈ నిధులు విడుదల కనాున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.13,088 కోట్లు విడుదల చేసింది. అదే విధంగా బీహార్ కు రూ.7,338 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.5,488 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ.5,727 కోట్లు, మహారాష్ట్రకు రూ.4,609 కోట్లు, రాజస్థాన్ కు రూ.4,396 కోట్లు విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ బడ్జెట్ అంచనాల్లో కేంద్రం నుంచి దక్కే పన్నుల వాటాను ప్రస్తావించారు. ఈ నిధుల పైన ప్రస్తుత ఆర్దిక కష్టాల్లో రెండు ప్రభుత్వాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కాగా.. గతం కంటే ఈ సారి ముందుగానే కేంద్రం రాష్ట్రాలకు ఈ నిధులు మంజూరు చేసింది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై బిగ్ ట్విస్ట్- వారి ఆశలు గల్లంతు..!!
కాగా, అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదనపు పన్నుల వాటా విడుదలతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి నిరంతరం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.చంద్రబాబు కేంద్రానికి ధన్యవాదాలు