1997లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ప్రతినిధులు ఒక మాట చెప్పారు. అవి విని గేట్స్ అస్సలు మొదట నమ్మలేదు. వాళ్లు చెప్పిన మాట ఏంటంటే.. 'ఈ దేశంలో మీ కంటే డిజిటల్ టెక్నాలజీని ఎక్కువగా నమ్మే ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు... ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు!' అని. సరేలే.. ఏదో మర్యాదపూర్వకంగా పది నిమిషాలు కేటాయిద్దామని అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
కానీ, ఆ పది నిమిషాల భేటీ హైదరాబాద్ రూపురేఖలనే కాదు, భారతదేశ ఐటీ చరిత్రను మలుపు తిప్పుతుందని, బిల్ గేట్స్ సమావేశాన్ని ఏకంగా 45 నిమిషాల పాటు పొడిగిస్తారని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఆ రోజు బిల్ గేట్స్‌ను తన విజన్‌తో కట్టిపడేసిన ఆ నాయకుడే నారా చంద్రబాబు నాయుడు!
ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!
అప్పటికి ల్యాప్‌టాప్ అనే పదం కూడా సామాన్యులకు సరిగ్గా తెలియదు. మన దేశంలోకి ల్యాప్‌టాప్‌లు అడుగుపెట్టిందే 1995లో అయితే, 1996లోనే ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిన భారతదేశపు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. 1997లో బిల్ గేట్స్‌తో జరిగిన ఆ చారిత్రక భేటీలో, చంద్రబాబు స్వయంగా తన ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేస్తూ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి ఉన్న అవకాశాలను, ప్రభుత్వం అందించే భద్రత, సహకారాన్ని స్పష్టంగా వివరించారు. ఓ భారతీయ రాజకీయ నాయకుడు అంత టెకీగా ఉండటం చూసి గేట్స్ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆ ఒక్క సమావేశం విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. అప్పటివరకు భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఆలోచనే లేని మైక్రోసాఫ్ట్ సంస్థ, అమెరికా వెలుపల తన తొలి ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను 1998లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత, 2017లో విశాఖపట్నం పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పత్రికా విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. "1997లో ఆయన చేతిలో ల్యాప్‌టాప్, దాన్ని ఆయన వాడిన తీరు చూశాకే ఈ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం కుదిరింది. ఒకవేళ భారత్‌లో అడుగుపెడితే అది మొదట మీ రాష్ట్రంలోనే అని ఆ రోజే మాట ఇచ్చాను. దాని ఫలితమే నేటి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్" అని ప్రశంసల వర్షం కురిపించారు. సాంకేతికతపై ఒక నాయకుడికున్న అపారమైన విశ్వాసం, ఒకే ఒక్క ల్యాప్‌టాప్ ప్రెజెంటేషన్‌తో ప్రారంభమై హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చిన తీరు భారతదేశ డిజిటల్ విప్లవంలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుత ఘట్టం.95లో ల్యాప్ టాప్స్ అడుగుపెట్టాయి
ఏపీని గట్టిగా దెబ్బ కొట్టిన ఎల్ నినో..: చంద్రబాబు యాక్షన్ ప్లాన్
విప్లవాత్మక మార్పునకు పునాది