ఎమ్మెల్సీల ఖరారులో లాస్ట్ మినిట్ ట్విస్ట్ - ఫైనల్ గా ఈ ఇద్దరు..!?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నేతలు సమాయత్తం అవుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ వరుస నిరసనలను ప్రణాళిక లు సిద్దం చేసింది. కాగా.. ఇప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. వీరి స్థానం లో టీడీపీ నుంచి ఖరారు అయ్యే అభ్యర్ధుల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Advertisement

వైసీపీ నుంచి పదవీ విరమణ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల స్థానాలు కూటమికే దక్కనున్నాయి. టీడీపీ ఈ రెండు స్థానాలను సొంతం చేసుకోనుంది. ఈ కొత్త ఎమ్మెల్సీల ఎంపిక పైన కూటమి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి 164 మంది సభ్యుల బలం ఉంది. మండలిలో మాత్రం వైసీపీకి ఆధిక్యత కొనసాగుతోంది. గవర్నర్ కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ లుగా ఉన్నమండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం పూర్తికానుంది. ఇప్పటికే జాకియా ఖానం బీజేపీకి దగ్గరయ్యారు. ఈ ఇద్దరి పదవీ కాలం ముగియటంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో రెండు సీట్లు కూటమి ఖాతాలోనే జమ కానున్నాయి. అందులో భాగంగా ఈ రెండు స్థానాల భర్తీ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. 2024 ఎన్నిక సమయంలో పలువురు సీనియర్లకు సీట్ల త్యాగం చేసిన కారణంగా ఎమ్మెల్సీ సీట్ల పైన హామీ ఇచ్చారు.

Advertisement
విజయ్ పార్టీలోకి తమిళనాడు మాజీ సీఎం - తేల్చి చెప్పిన ఓపీఎస్..!!

చంద్రబాబు తుది కసరత్తు

పార్టీ నుంచి చాలా మంది ఇప్పుడు ఈ సీట్ల వైపు ఆశగా చూస్తున్నారు. దేవినేని ఉమా, వంగవీటి రాధా, పిఠాపురం వర్మ సహా పలువురు నేతలు ఈ రేసులో ఉన్నారు. అయితే, రాజ్యసభ సీటు కోసం పలు మార్లు ఆశించి.. నిరాశ చెందిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడు కొత్తగా మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు పేరు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఆయన పేరు తుది జాబితాలో ఉంటుందని చెబుతున్నారు. ఇక, రెండో స్థానం రాయలసీమ నుంచి ఎంపిక చేయనున్నారు. అందులో భాగంగా బీటెక్ రవి, సుగవాసి ప్రసాద్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సుగవాసికి గతంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కాపు-బలిజ సామాజిక వర్గానికి సీమ ప్రాంతం నుంచి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాయచోటి జిల్లా కేంద్ర హోదా కోల్పోవడం, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో ఇప్పుడు ప్రసాద బాబుకు ఇవ్వటం అవసరమని గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో.. చంద్రబాబు చివరగా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.

English Summary

CM Chandra Babu almost finalized the Governor quota MLC's form the party, to announce soon