ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ పరామర్శ యాత్రలు... జరుగుతున్న ర్యాలీల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారని.. మంత్రులు గట్టిగా తిప్పి కొట్టాలని సూచించారు. డీఎస్సీ పైన చేస్తున్న రాద్దాంతం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం పైనా స్పష్టత ఇచ్చారు. మంత్రులు స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని చంద్రబాబు నిర్దేశించారు.
కేబినెట్ అజెండా తరువాత మంత్రులతో చంద్రబాబు తాజా పరిణామాల పైన స్పందించారు. ఇదే సమయంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. జగన్ అండ్ కో చేస్తున్న అరాచకాలను కంట్రోల్ చేయడానికి తనకు రెండు నిమిషాలు చాలని...కానీ, అంతా రాజకీయ ముసుగులో వారు నేరాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. డీఎస్సీపై చేస్తున్న రాద్దాంతాన్ని కూడా అందరు గమనిస్తున్నారని తెలిపారు. అన్ని విషయాలు డీఎస్సీపై మనం ప్రజలకు వివరించామని అన్నారు. వైసీపీ నేతలు కోర్టులతో కూడా చీవాట్లు పడ్డారని విమర్శించారు. అయినా వైసీపీ నేతలు యాగీ చేస్తున్నారని ఆగ్రహించారు. డీఎస్సీపై వైసీపీ నేతలు ఇప్పుడు ధర్నాలు చేయడం ఏంటి? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలకు అసలు రిజర్వేషన్ల గురించి తెలియదని వ్యాఖ్యానించారు. స్సీలో హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై.. అందరికీ తెలపాల్సిన బాధ్యత మంత్రులదేనని సీఎం స్పష్టం చేసారు.
ఏపీ కేబినెట్ భేటీ: ఆ హామీలపై కీలక నిర్ణయం, ముహూర్తం ఫిక్స్..!!
కాగా, ఈ నెలాఖరుకు వెలుగొండ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలకు తాగునీటి కోసం నీళ్లు ఇస్తామని వెల్లడించారు. ఎల్‌నినో గురించి మంత్రులు ప్రజలకు తెలపాలని సూచించారు. ఇంత వర్షాభావం ఉన్న కూడా మంచినీటికి కూడా మనం నీళ్లు ఇస్తున్నామనేది ప్రజలకు వివరించాలని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర ప్రజల్లో ఓ సెంటిమెంట్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. స్వర్ణాంధ్ర, వికసిత భారత్ ఈ రెండు స్వాతంత్య దినోత్సవ సందర్భంగా మంత్రుల ప్రసంగాల్లో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. క్వాంటం వ్యాలీ జనవరిలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. 'దిశా' అనేది అసలు చట్టం రూపం నోచుకోలేదని సీఎం తెలిపారు. అయినా 'దిశా' పోలీస్ స్టేషన్లు, వాహనాలని చెప్పి హడావుడి చేశారని దుయ్యబట్టారు. జగన్ పరామర్శలు అంటే జనం భయపడే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు విమర్శించారు.మంత్రులకు దిశా నిర్దేశం