గుడివాడ కేంద్రంగా సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..!!


ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో గుడివాడలో జరిగిన భూకబ్జాలు, అవినీతిపై సీఎం తీవ్రంగా స్పందించారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం కింద డబ్బులు వేస్తామని వెల్లడించారు. నదులన్నీ అనుసంధానం చేస్తామని తెలిపారు.

Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అమృత్‌ 2.0 AIUDF శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులు అందజేశారు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్‌గా మారారని పేర్కొన్నారు. మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్‌ చేస్తే ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు. గత ప్రభుత్వ లక్ష్యం ప్రజలను దోపిడీ చేయడమేనని విమర్శించారు. తన జీవితంలో ఇలాంటి రాజకీయాలు చూడలేదని అన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పట్టిసీమ నిర్మిస్తుంటే చాలామంది వ్యతిరేకించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చామని అన్నారు. ఇప్పటి వరకు 450 టీఎంసీలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం ఏపీకి జీవనాడి అని ఉద్ఘాటించారు.

Advertisement
వారిని వదులుకోవటానికీ సిద్దం, సర్వేల్లో తేలిందిదే - చంద్రబాబు..!!

ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు అందిస్తాం

కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తలను వేరు చేసుకోవాలని తెలిపారు. తడి చెత్తను కంపోస్ట్‌గా తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో అక్టోబర్‌ 2వ తేదీ నాటికి చెత్తలేకుండా చేస్తామని చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం కింద డబ్బులు వేస్తామని వెల్లడించారు. అంగన్‌ వాడీ కార్యకర్తలు, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో పనిచేసే కార్మికులకు తల్లికి వందనం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తానని చెప్పారు. నదులన్నీ అనుసంధానం చేస్తామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని వెల్లడించారు. ముందుచూపుతోనే ప్రకృతి సేద్యాన్ని తీసుకువచ్చామని చంద్రబాబు వివరించారు.

English Summary

CM Chandra Babu participate in the Swachha Andhra - Swarnandhra programme in Gudivada, made key comments