విజయవాడ - అమరావతి కృష్ణా నది మీదుగా రోప్ వే: రాజధాని పరిధి పెంపు, మెగా సిటీగా..!!

రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలకు గడువు ఖరారు చేసారు. విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్‌లో కృష్ణా నదిపై వంతెనల నిర్మాణాల పైన నిర్ణయం తీసుకున్నారు. రైల్వే లైన్ నిర్మాణానికి భూ సమీకరణ.. అదే విధంగా అమరావతి పరిధి పైనా స్పష్టత ఇచ్చారు. విజయవాడ, గుంటూరు కలిపి మెగా సిటీగా రాజధాని పైన పరిశీలన చేయాలని నిర్ణయించారు.

Advertisement

అమరావతి ప్రణాళికలు.. అమలు.. నిర్మాణాల పైన సీఆర్డీఏ అథారిటీ సమీక్ష చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అందులో భాగంగా 29 గ్రామాలే రాజధాని పరిధి కాకుండా.. విజయవాడ, గుంటూరు కలిపి మెగా సిటీగా చేయాలనే ప్రణాళిలను పరిశీలన చేసి.. నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా నిర్మాణంలో ఉన్న భవనాలు.. రోడ్ల పైన అధికారులు వివరాలు సమర్పించారు. కాగా.. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, రైల్వేలైన్‌ నిర్మాణావినికి మోతడక గ్రామంలో భూమిని సేకరిస్తున్నామని, అక్కడ 2,340 ఎకరాలు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదించిందని మంత్రి నారాయణ వివరించారు. పల్నాడు జిల్లాలో దేవదాయ శాఖకు చెందిన 244.39 ఎకరాల ఇనామ్‌ భూములను భూసమీకరణ కింద తీసుకొని, రూ.122 కోట్లు చెల్లించడానికి అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. 2014-19లో ప్రారంభించిన హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు సంబంధించి రెన్యువల్‌ ఫీజు రద్దు చేయడానికి ఏపీ రెరా అంగీకరించిందని చెప్పారు.

Advertisement
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!

సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ప్రారంభ ముహూర్తం

కాగా, రైతులకు యాన్యుటీ కింద గత నెలలో రూ.300 కోట్లు చెల్లించామని, దీనికోసం తీసుకున్న రుణానికి ర్యాటిఫికేషన్‌ చేశామన్నారు. 9 గిగావాట్ల డేటా సెంటర్‌కు టెండర్‌ పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. విజయవాడ, అమరావతి మధ్య భవిష్యత్‌ లో కృష్ణా నదిపై ఎన్ని వంతెనలు అవసరమవుతాయనే అంశంపై కన్సల్టెంట్లతో అధ్యయనం చేయించనున్నారు. 2014-19లో ప్రారంభించిన అమరావతిలో నెట్‌వర్క్‌ విస్తరణ కోసం 20 ప్రాంతాల్లో 5జీ టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని తెలిపారు. రోప్‌వే ప్రాజెక్టును పీపీపీ మోడల్‌లో చేపట్టేందుకు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, దుర్గగుడి, పున్నమిఘాట్‌, భవానీ ఐల్యాండ్‌ మీదుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుసంధానించేలా అనుమతి ఇచ్చామని వెల్లడించారు. క్వాంటమ్‌ వ్యాలీలో 18 అంతస్తులతో రెండు టవర్లు నిర్మించేందుకు రూ.1,205 కోట్లతో ఎల్‌అండ్‌టీకి అప్పగించామని చెప్పారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు దాదాపు పూర్తి కావటంతో, వర్షాలు రాకుండా ఉంటే ఈ నెల 13న సీఎం చంద్రబాబు దానిని ప్రారంభించాలని నిర్ణయించారు.

English Summary

CRDA approved major welfare and development decisions to accelerate Amaravati's capital construction