గవర్నర్ తో పవన్ భేటీ, కీలక చర్చలు..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ప్రభుత్వం వర్సస్ వైసీపీ రాజకీయం పీక్ కు చేరింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి పార్టీలు అడుగులు వేస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయం ఒక్క సారిగా కొత్త టర్న్ తీసుకుంది. ఇదే సమయంలో పలు విమర్శల తో పాటుగా చర్చలు మొదలయ్యాయి. కాగా, గవర్నర్ తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ ఆసక్తి కరంగా మారింది.

Advertisement

డిప్యూటీ సీఎం పవన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. జిల్లాల పర్యటనలో ఉన్న పవన్.. ఈ సాయంత్రం గవర్నర్ అప్పాయింట్ మెంట్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకున్న పరిస్థితులు.. తాజా పరిణామాలు.. అరెస్ట్ లు.. వివాదాల పైన చర్చించే అవకాశం ఉంది. విజయవాడ కేంద్రంగా సాయిక్రిష్ణ లాకప్ డెత్ ఆరోపణ ల తరువాత ఒక్క సారిగా రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. సామాజిక వర్గాలు.. విమర్శలు మొదలు అయ్యాయి. ఈ పరిణామాల పైన పవన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక.. తాజాగా పవన్ మరో నిర్ణయం ప్రకటించారు. సోషల్ మీడియా కేంద్రంగా పోస్టింగ్ లతో వేధిస్తున్న వారి విషయంలోనూ కఠినంగానే ఉంటామని స్పష్టం చేసారు. ఇందు కోసం తన కార్యాలయంలోనే ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ విమర్శల పేరుతో చేస్తున్న పోస్టింగ్స్ పైన ఆగ్రహంతో ఉన్నారు.

Advertisement

గవర్నర్ తో తాజా పరిణామాల పై చర్చ

కాగా, ఇప్పుడు గవర్నర్ భేటీ వేళ ఈ అంశాల పైన పవన్ వివరించే అవకాశం కనిపిస్తోంది. పవన్ ను టార్గెట్ చేస్తూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. అరెస్ట్ ల వ్యవహారంతో పాటుగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో శాఖల పరంగా పురోగతి.. కేంద్రం నుంచి వస్తున్న మద్దతు వంటి అంశాల పైన చర్చంచే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనూ గవర్నర్ తో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మర్యాద పూర్వక భేటీగానే పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఈ భేటీ పైనా రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

English Summary

Deputy CM Pawan Kalyan to meet Governor Abudl nazeer to discuss key issues and latest developments