ఆయనపై చర్యలు తీసుకోరా, ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా...!!

డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్‌పైనా బహిరంగంగా సభ్య సమాజం తలదించుకునేలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జడ శ్రవణ్‌ కుమార్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే శ్రావణ్ కుమార్ వ్యాఖ్యల పైన రఘురామ మద్దతు దారులు పోలీసులకు ఫిర్యాదులు చేయగా.. కేసు నమోదు చేసారు. అయినా, చర్యలు తీసుకోకపోవటం పైన రఘురామ ఆగ్రహంతో ఉన్నారు.

Advertisement

జడశ్రావణ్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామ నిలదీసారు. తమిళనాడులో సీఎంపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. అక్కడి ప్రభుత్వం అరెస్ట్‌ చేసిందని, ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. అయితే మన రాష్ట్రంలో బహిరంగంగా కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాజీ మేజిస్ట్రేట్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ.. అతనిపై ఏ విధమైన చర్యలూ లేవని పేర్కొ న్నారు. న్యాయవ్యవస్థ తమిళనాడులో ఒకలా... ఏపీలో మరోలా ఉంటుందా.. అని ప్రశ్నించారు. శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌పై మన ప్రభుత్వ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సరిగా వాదించలేక పోయారో ఏమో తెలియదు గానీ, ఆ కేసును నాలుగు వారాలు వాయిదా వేసిన కోర్టు.. శ్రవణ్‌కుమార్‌పై ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని తెలియజేయడం పైనా స్పందించారు.

Advertisement

చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఇదే సమయంలో .. ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రభుత్వం, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ల డానికి 'తెలుగు వీర లేవరా' అనే సంస్థ స్థాపించానని, ఇదే సంస్థ ద్వారా 'నాకు న్యాయం చేయండి..' అని అడగాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని రఘురామ వ్యాఖ్యా నించారు. ఇదే వ్యవహారంలో కొద్ది రోజుల క్రితం రఘురామ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తే 'నాలుక కోస్తాం.. సమాధి కడతాం..' అంటూ వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 ప్రకారం మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని ఉంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా వెల్లడించింది. అదే మాట తాను చెబితే తన పైన బరి తెగించి మాట్లాడినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

English Summary

Deputy Speaker Raghu Rama Raju demanded to take action against Jada Sharvan kumar on his comments