మద్యం బాబులకు ఊహించని షాక్. నిత్యం వినియోగంలో ఉన్న పలు ప్రధాన బ్రాండ్ల మద్యం అమ్మకాల పైన నిషేధం విధించారు. మద్యం తయారీలో కృత్రిమ ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నారనే తీవ్ర ఆరోపణలతో ఈ బ్రాండ్ల పైన భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కఠిన నిర్ణయం తీసుకుంది. ఇందులో విస్కీ, రమ్ తయారీ సంస్థలు ఉన్నాయి. నిత్యం పెద్ద సంఖ్య లో విక్రయాలు జరిగే బ్రాండ్ల పైనా చర్యలు తీసుకుంది.
మద్యం ప్రియులు ఎక్కువగా వినియోగించే ప్రధాన బ్రాండ్ల అమ్మకాల పైన FSSAI నిషేధం విధించింది. డియాజియో గ్రూప్‌నకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ అలాగే ఇన్‌బ్రూ బేవరేజెస్ సంస్థలు తయారుచేస్తున్న కొన్ని ప్రత్యేక బ్రాండ్ల అమ్మకాలపై ఈ తాజా నిషేధాజ్ఞలను జారీ చేసింది. ఈ సంస్థలు తమ ఉత్పత్తుల్లో కృత్రిమ ఫ్లేవర్లు వాడుతున్నారన్న ఆరోపణలతో ప్రధాన విస్కీ, రమ్ బ్రాండ్ల అమ్మకాల పైన చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో యునైటెడ్ స్పిరిట్స్ తయారుచేస్తున్న యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీతో పాటు, ఇన్‌బ్రూ బేవరేజెస్ ఉత్పత్తి చేస్తున్న బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ ట్రిపుల్ ఎక్స్ రమ్‌ల అమ్మకాలను నిలిపివేయాలని FSSAI ఆదేశించింది.
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!
తాజాగా చేపట్టిన తనిఖీల్లో కొన్ని కంపెనీలు విస్కీ, రమ్‌ల తయారీలో ముడిసరుకులు..బయటి నుంచి ఫ్లేవర్లను వాడుతున్నట్టు తమ తనిఖీల్లో తేలిందని FSSAI వెల్లడించింది. ఇది వినియోగ దారులను ఉత్పత్తి నాణ్యత విషయంలో మోసగించడమేనని స్పష్టం చేసింది. కాగా.. ఈ ఆదేశాల సమయంలో పాక్షిక సడలింపు ఇచ్చింది. ఈ రెండు ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన సరుకు అమ్ముకోవటానికి షరతులతో అనుమతి ఇచ్చింది. అదే విధంగా మద్యం తయారీ విషయంలో బాటిళ్ల పైన పూర్తి వివరాలతో వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా సవరించిన లేబుల్స్ అతికించాలని నిర్దేశించింది. మద్యం ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్‌తో పాటుగా ఇన్‌బ్రూ బేవరేజెస్ ఉత్పత్తులపై ఈ చర్యలు తీసుకోవడం సంచలనంగా మారుతోంది.తాజా ఆదేశాలు.. సడలింపు