ఎల్‌‌నినో వేళ తీపి కబురు, పెరగనున్న వర్షాలు - ఈ జిల్లాలపై ప్రభావం..!!

ఎల్‌‌నినో వేళ గత కొద్ది రోజుల క్రితం వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. వాతావరణం లో మార్పు మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్‌‌నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక అంశాలను వెల్లడించింది. రానున్న రోజుల్లో వర్షాలు పెరుగతాయని ప్రకటించింది. దీనికి సంబంధించి కీలక విశ్లేషణ చేసింది.

Advertisement

వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రెండు నెలలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొన్న పరిస్థితులు ఆగస్టు నెలలో కొంతవరకు మెరుగుపడనున్నాయి. ఈనెలలో ఉత్తర, దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది.ప్రకారం ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.

Advertisement
ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు, అరుదైన అవకాశం- షెడ్యూల్.. సేవలు..!!

వాతావరణ శాఖ తాజా అంచనా

అదే సమయంలో విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. రుతుపవనాల సీజన్‌లో రెండో సగం అంటే ఆగస్టు, సెప్టెంబరు నెలలు కలిపి చూస్తే ఏపీలో కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాలు, శ్రీకాకుళం, విజయనగరంలో తక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా..రానున్న 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

English Summary

IMD Alerts over heavy rain fall in many parts of AP and Telangana for next two dates