విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇన్‌ స్టా రీల్స్.. భక్తులు ఆగ్రహం.. రంగంలోకి పోలీసులు..

విజయవాడలోని ప్రముఖ దేవస్థానం అయిన ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో షాకింగ్ ఘటన జరిగింది. నిత్యం వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఈ గుడిని అపవిత్రం చేస్తూ ఓ యువతి రీల్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయ ప్రాంగణంలోని మహామండపం 7 వ అంతస్తు రాజగోపురం వద్ద ఉన్న స్థలంలో సదరు యువతి డాన్స్ చేస్తూ రీల్స్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పనులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.రాను రాను ఇలాంటి రీల్స్ పిచ్చి మరింత ముదురుతోందని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఘటనపై ఇంద్రకీలాద్రి ఆలయ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి ఘటనలు ఆలయ పరిసరాల్లో జరగడం దురదృష్టకరం అని తెలిపింది. ఈ మేరకు ఈ ఘటనపై ఆలయ ఈఓ సీనా నాయక్.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. జూలై 30 న మధ్యాహ్నం ఒంటి గంటా 45 నిమిషాల నుంచి ఒంటి గంటా 47 నిమిషాల వరకూ ఈ రీల్స్ చేసినట్లు సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. రీల్స్ చేసిన యువతికి సంబంధించిన ఇన్ స్టా గ్రామ్ ఐడీ వివరాలు పోలీసులు పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.