ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయటమే నా జీవితంలో పెద్ద తప్పు- జనసేన ఎమ్మెల్యే..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ రాజకీయ వార్ పీక్ కు చేరింది. రాజధాని కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీని లక్ష్యం గా చేసుకొని కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం టార్గెట్ గా మాజీ సీఎం జగన్ కొత్త రాజకీయం మొదలు పెట్టారు. కాగా, జనసేన సీనియర్ ఎమ్మెల్యే తాజాగా పోటీ.. ప్రస్తుత రాజకీయాల పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో.. ఆ తరువాత టీడీపీ లో పని చేసిన బుద్ద ప్రసాద్ 2024 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014-19 కాలంలో డిప్యూటీ స్పీకర్ గానూ పని చేసారు. వివాద రహితుడుగా పేరు ఉన్న బుద్ద ప్రసాద్ ప్రస్తుత రాజకీయాల పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందంటే.. అది ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయటం అంటూ వ్యాఖ్యానించారు. రోశయ్య విగ్రాహావిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. రోశయ్య వంటి మహానుభావుల సరసన నిలబడి రాజకీయాలు చేసామని.. ఈ రోజు ఎలాంటి రాజకీయాల్లోకి వెళ్తున్నామో అర్దం కావటం లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

ప్రస్తుత రాజకీయాల పై ఆవేదన

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అని నిత్యం బాధ పడాల్సి వస్తుందన్నారు. రోశయ్యకు ఇతరుల ను ఎలా గౌరవించాలో తెలుసని.. ఇప్పటి నాయకుల భాష వాడలేదని చెప్పుకొచ్చారు. సిద్దాంత పరంగా వ్యతిరేకించారే కానీ, వ్యక్తిగత విమర్శలు చేయలేదని చెప్పారు. రాజకీయాలు కలుషితమైన తరుణంలో రోశయ్య విగ్రహం ద్వారా స్పూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. సభా వేదిక పైన ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి సైతం ఇలాగే బాధ పడుతున్నారని బుద్ద ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

English Summary

Janasena MLA mandali Budha Prasad made interesting comments over present politics in the state