చెప్పినట్లుగానే వారికి పవన్ మార్క్ ట్రీట్మెంట్ షురూ..!!

డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియా చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని వదిలేస్తుంటే చేతకానివారిలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం సరికాదన్నారు. ఈ ఫిర్యాదుల కోసం తన కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అడ్డగోలు విమర్శలు, అసభ్యకర పోస్టులపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరి హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వాక్‌ స్వాతంత్ర్యం వెళ్లినప్పుడు చట్టం తన పని తాను చేసుకు పోతుందని, అలాంటి వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ గట్టిగా హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం సరికాదన్నారు. కులాలు, మతాలను రెచ్చగొట్టేలా శృతిమించి మాట్లాడుతున్నారని పవన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిపై కచ్చితంగా ఆధారాలతో ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫ్రీడమ్ ఆఫ్‌ స్పీచ్‌ అంటే వ్యక్తిత్వహననానికి పాల్పడటం కాదని చెప్పారు.

Advertisement

పవన్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, విమర్శలు చేయడం స్వాగతించదగ్గ పరిణామమేనని అన్నారు. సోషల్‌ మీడియా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ఒక కీలక అడుగు వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మతపరమైన నమ్మకాలను, దేవుళ్లను అవమానించడం రాజ్యాంగ పరిధిలోకి రాదు. నేరానికి, నేరస్థులకు ఎటువంటి కులం, మతం, రాజకీయ అనుబంధం ఉండదు. తప్పు చేసి తప్పించుకోవడానికి కులం, మతం, రాజకీయం వెనుక దాక్కోవాలని చూడొద్దు. సోషల్ మీడియా వేధింపుల అదుపునకు డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు. బాధితులు తమ వద్ద ఉన్న స్క్రీన్‌షాట్లు, లింకులు, వీడియో ఆధారాలను డిప్యూటీ సీఎం ఆఫీస్‌కు సమర్పించవచ్చని పవన్ స్పష్టం చేసారు.

English Summary

Pawan Kalyan announced that offenders would face stringent legal action and assured victims of online harassment of full protection