పవన్ పదేళ్ల నొప్పికి రిలీఫ్- మూడున్నర గంటల సర్జరీ, తిరిగి విధుల్లో అప్పుడే..!!

డిప్యూటీ సీఎం పవన్ కు శస్త్ర చికిత్స జరిగింది. భుజాల సమస్యతో బాధ పడుతున్న పవన్ తాజా గా ముంబాయిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. పదేళ్ల కాలంగా భుజం నొప్పితో పవన్ ఇబ్బంది పడుతున్నారు. రెండు భుజాలకు సర్జరీ అవసరం అయినా.. ఈ రోజు మూడున్నార గంటల పాటు ఒక భుజానికి చేసిన శస్త్రచికిత్స విజయవంతం అయింది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న పవన్.. దాదాపు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కు ముంబయిలో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. దాదాపు దశాబ్ద కాలంగా వేధిస్తున్న రెండు భుజాల రొటేటర్ కఫ్ గాయాలకు సంబంధించి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేస్తే నొప్పి తీవ్రంగా ఉంటుందని భావించిన వైద్య బృందం తొలుత కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ విజయవంతం గా నిర్వహించింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటు న్నారు. 2016లో పవన్ భుజానికి గాయమైంది. ఆ సమయంలో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, చికిత్స కొనసాగించాలని సూచించినప్పటికీ రాజకీయ, ప్రజా కార్యక్రమాల కారణంగా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. తరువాత జరిగిన సభలు.. యాత్రల్లో తరచూ కరచాలనం చేయడం, చేతులు పట్టుకుని లాగడం, సెల్ఫీల కోసం దగ్గరకు రావడం వంటి సందర్భాల్లో భుజాలపై మరింత ఒత్తిడి పడింది.

Advertisement

సర్జరీ విజయవంతం.. వైద్యుల పర్యవేక్షణలో

రెండు నెలల క్రితం పవన్ అస్వస్థతకు గురి కావటంతో.. పరీక్షలు చేసిన వైద్యులు ఆయన ముక్కు కు శస్త్రచికిత్స చేసారు. ఆ సమయంలోనే భుజాలకు పరీక్షలకు చేయగా.. రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, కండరాల చీలికలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో, గత వారం ముంబాయి వెళ్లి ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్న పవన్.. ఈ రోజు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కుడి భుజంలోని దెబ్బతిన్న రొటేటర్ కఫ్‌ను వైద్యులు సరిచేశారు. మరో భుజానికి సర్జరీ చేయాల్సి ఉన్నా.. రెండు నెలల తరువాత చేయాలని డిసైడ్ అయ్యారు. పవన్ దాదాపు మూడు వారాలు విశ్రాంతిలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.

English Summary

Pawan Kalyan underwent surgery at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, Doctors reveals his health condition