రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లను ఖరారు చేసారు. ప్రయాణికు ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. ఈ రైళ్లు ప్రయాణ తేదీలు.. మార్గంతో పాటుగా షెడ్యూల్ ను వెల్లడించారు. కోయంబత్తూరు-జైపూర్ ప్రత్యేక వీక్లీ రైలు (06181)ను ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 3 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు.
ఈ రైళ్ల రూట్ ఏపీ, తెలంగాణ మీదుగా కొనసాగనుంది.
రైల్వే అధికారులు బిగ్ అప్డేట్ ఇచ్చారు. కోయంబత్తూరు-జైపూర్- కోయం బత్తూరు ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ను ప్రకటించారు. కోయంబత్తూరు- జైపూర్-కోయంబత్తూరు ప్రత్యేక రైలు (06182)ను ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 6 వరకు ప్రతి ఆదివారం కొనసాగనుంది. ఈ రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముడ్‌ఖేడ్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూర్ణా, హింగోలి డెక్కన్, వాసిం, అకోలా, మల్కాపూర్, భూసావల్, జల్గావ్, ధరన్‌గావ్, ఉడ్నా, భరుచ్, వడోదర, గోద్రా, రత్లం, జవోరా, మండ్‌సోర్, నిమచ్, ఛత్తీస్ఘడ్, భిల్వారా, బిజయ్‌నగర్, నాసిరాబాద్, అజ్మీర్, కిషన్‌గర్ స్టేషన్ల మీదుగా వెళ్తుందని చెప్పారు.
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!
అదే విధంగా బాంద్రా టెర్మినల్-వెలంకని ప్రత్యేక రైలు (09059)ను ఈ నెల 27వ తేదీ, సెప్టెంబరు 1వ తేదీలలో రెండు ట్రిప్పులు నడపనున్నామన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (09060) ఈ నెల 30, సెప్టెంబరు 4 తేదీలలో రెండు ట్రిప్పులు నడుస్తుందన్నారు. ఈ రైలు బోరివాలి, వసాయ్ రోడ్, పన్వేల్, కర్జత్, లోనావాలా, పూనా, డౌండ్, షోలాపూర్, వాడి, యాద్గిర్, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంటు, తిరువనమలై, విల్లుపురం, మయిలదుతురై, నాగపట్టణం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుందని అధికారులు వెల్లడించారు.రూట్.. షెడ్యూల్