సికింద్రాబాద్, విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు ఈ తేదీల్లో రద్దు- ఇవి దారిమళ్లింపు..!!

రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులకు బిగ్ అలర్ట్ జారీ అయింది. ఖాజీపేట-కొండపల్లి మార్గంలో నాన్​ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే సమయంలో మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19 వరకు ఐదు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు కానున్నాయి. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్, ప్రయాణాల్లో మార్పులకు వీలుగా రైల్వే శాఖ రద్దయిన రైళ్ల వివరాలు.. దారి మళ్లించిన వాటి షెడ్యూల్ ప్రకటించింది.

Advertisement

ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు డోర్నకల్- విజయవాడ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసారు. అదే విధంగా భద్రాచలం రోడ్ - విజయవాడ రైళ్లు, విజయవాడ- సికింద్రాబాద్ డైలీ, గుంటూరు- సికింద్రాబాద్ మధ్య రోజూ నడిచే రైలుతో పాటుగా విశాఖపట్నం - మహబూబ్ ​నగర్ డైలీ (ఆగస్టు 16, 17, 18 తేదీల్లో రద్దు), కాకినాడ టౌన్‌ - లింగంపల్లి (ఆగస్టు 16, 17, 18 తేదీల్లో రద్దు) చేసారు. ఇక, సికింద్రాబాద్ - మణుగూరు డైలీ, ఖాజీపేట - దోర్నకల్ డైలీ ఆగస్టు 15 నుంచి 19 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. 18519 విశాఖపట్నం-లోకమాన్యతిలక్‌ టెర్మినల్‌ రైలు ఆగస్టు 14 నుంచి 18 వరకు ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగించనుంది. ఈ రైలు విజయవాడ - గుంటూరు - పగిడిపల్లి - సికింద్రాబాద్ మార్గంలో నడిపించనున్నారు. 18520 ఎల్​టీటీ ముంబై - విశాఖపట్నం డైలీ ఎక్స్​ ప్రెస్ ఆగస్టు 14 నుంచి 18 వరకు ప్రత్యామ్నాయ మార్గంలో నడవనుంది.

Advertisement
నాగర్ సోల్- తిరుపతి ప్రత్యేక రైళ్లు: రూట్, షెడ్యూల్..!!

దారి మళ్లింపు- ప్రయాణీకులకు సూచనలు

ఇక.. భువనేశ్వర్‌-ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ డైలీ, 17208 మచిలీపట్నం-సాయినగర్‌ శిర్డీ ఈ తేదీలో విజయవాడ - గుంటూరు - పగిడిపల్లి - సికింద్రాబాద్ మార్గంలో వెళ్లనుంది. 17205 సాయినగర్‌ శిర్డీ-కాకినాడ పోర్ట్‌ (మంగళ, గురు, ఆది) ఆగస్టు18న దారి మళ్లించారు. ఖాజీపేటకు బదులుగా వయా పగిడిపల్లి, గుంటూరు మీదుగా ప్రయాణించనుంది. చల్లపల్లి-షాలిమార్‌ డైలీ ఆగస్టు 18, 19 తేదీల్లో చర్లపల్లి - పగిడిపల్లి - గుంటూరు - విజయవాడ మీదుగా నడపనున్నారు. 00761 రేణిగుంట-హజ్రత్‌నిజాముద్దీన్‌(ఆగస్టు 14, 15, 17, 28) తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గంలో కొనసాగనుంది. అదే విధంగా 17201/17202 గుంటూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 15వ తేదీ నుంచి 19 వరకు గుంటూరు-ఖాజీపేట మధ్య రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

English Summary

Railways announce some trains cancel and main express trains route diversion due to Non inter locking works in Khazipet - Kondapalli Route