నరసాపురం-అరుణాచలం వీక్లీ ఇక రెగ్యులర్:షెడ్యూల్ ఇలా..!!

అరుణాచలం భక్తులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు స్పెషల్‌ రైలుగా నడుస్తున్న నరసాపురం- అరుణాచలం (తిరువణ్ణామలై) ఎక్స్‌ప్రెస్‌ ఇక రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడవనున్నది. తొలి రెగ్యులర్‌ సర్వీస్‌ను భీమవరం టౌన్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఆక్యుపెన్సీ అంచనాలకు మించి ఉండటం తో ఈ సర్వీసును రెగ్యులర్ గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

నర్సాపురం నుంచి గత ఏడాది జూలై 9న తిరువణ్ణామలై స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామని ఆక్యుపెన్సీ 110 శాతానికి చేరుకోవడంతో విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిని రెగ్యులర్‌ సర్వీస్‌గా మార్చాలని కోరామని మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారడంతో ఇబ్బందులు ఉండవన్నారు. జూలై 10 నుంచి నరసాపురం-బెంగళూరు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రానున్నరోజుల్లో నరసాపురం నుంచి విశాఖపట్నానికి పగటిపూట రైలు సర్వీస్‌, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో వందేభారత్‌కు హాల్ట్‌, నరసాపురం నుంచి వారాణసికి రైలు సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

ప్రయాణీకులకు మరింత వెసులుబాటు

English Summary

Railways decided to upgrade the Arunachalam Weekly express from Narsapuram as Regular train, announces the halt station