ఏపీ మీదుగా వేళాంకణికి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్

వివిధ స్టేషన్ల మధ్య ఏర్పడుతోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.

Advertisement

ఈ క్రమంలో తమిళనాడులోని ప్రఖ్యాత క్రైస్తవ పుణ్యక్షేత్రం వేళాంకణికి ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. గుజరాత్ లోని వల్సాడ్ నుంచి మొదటి రైలు ఈ నెల 14వ తేదీన పట్టాలెక్కుతుంది. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఏపీ నుంచి అరుణాచలం, చిదంబరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడుతుంది.

Advertisement

ఈ నెల 14వ తేదీ మంగళవారం సాయంత్రం 6: 25 నిమిషాలకు వల్సాడ్ నుంచి బయలుదేరే నంబర్ 09030 ప్రత్యేక రైలు రెండో రోజు అంటే గురువారం ఉదయం 10 గంటలకు వేళాంకణికి చేరుకుంటుంది.

ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటలకు వేళాంకణి నుంచి బయలుదేరే నంబర్ 09029 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 నిమిషాలకు దహను రోడ్ స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు వల్సాడ్ వరకు వెళ్లదు. దహను రోడ్ వరకే దీన్ని పరిమతం చేశారు.

Advertisement

దహను రోడ్, పాల్ఘర్, వసై రోడ్, పన్వేల్, లోనావాలా, పుణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుపాద్రిపుళియూర్, చిదంబరం, మైలాడుథురై, తిరునళ్లార్, కరైకల్, నాగూర్, నాగపట్నం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

English Summary

Railways to run Special Train From Valsad to Velankanni in Tamil Nadu, Covers AP, Tickets Open Now. Train No. 09030 Valsad to Velankanni and Train No. 09029 Velankanni to Dahanu Road are announced. Advance reservation opens at 8.00 AM.