వివాహేతర బంధానికి అడ్డు: పక్కా ప్లాన్‌-ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య


తూర్పుగోదావరి: రామచంద్రపురంలో ఆగస్టు 26న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చెల్లూరి రాంబాబు కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే అతడ్ని హత్య చేసిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీధర్ కుమార్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈమె అసలు తల్లేనా? ప్రియుడి కోసం కన్నబిడ్డకు చిత్రహింసలు, వేడి గరిటతో వాతలు

భార్యను అదుపులోకి తీసుకుని..

తొలుత రాంబాబు మృతిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం రాంబాబు హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చి రాంబాబు భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

వివాహేతర సంబంధానికి అడ్డుగా..

కాగా, రాంబాబు భార్య క్రాంతి ప్రియదర్శినికి పట్టణంలోని శీలంవారిసావరానికి చెందిన కుడిపూడి మోహన్ శివసాయికిశోర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తన భర్తను అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ప్రియుడు కిశోర్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది.

హత్యకు పక్కా ప్లాన్‌..

ఆ తర్వాత ఫోన్ ద్వారా మాట్లాడుకుంటే విషయం బయటపడుతుందని డమ్మీ ఫేస్‌బుక్ అకౌంట్లను మారుపేర్లు, అమ్మాయిల పేర్లతో ఓపెన్ చేసి మెసెంజర్ ద్వారా మాట్లాడుకుంటూ రాంబాబు హత్యకు కుట్రలు పన్నినట్లు సీఐ తెలిపారు.

హత్య చేశారిలా..

హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న కిశోర్ హత్య కుట్రలో భాగంగా ఆగస్టు 25న శనివారం సాయంత్రం రామచంద్రపురం చేరుకున్నాడు. రాంబాబు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే భార్య క్రాంతి, కిశోర్‌లు తాము వేసుకున్న అమలు చేశారు. మొదట భర్త రాంబాబుకు క్రాంతి నిద్రమాత్రలు ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన కిశోర్‌తో కలిసి రాంబాబు చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులు క్రాంతి, కిశోర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కిశోర్ నుంచి రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Have a great day!
Read more...

English Summary

Ramachandrapuram in East Godavari, police revealed Rambabu' murder mystery.