ఏపీలోని రెండు జిల్లాల్లోని ప్రయివేటు పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించారు. ఏపీలో భోగాపురం విమానాశ్రయం రేపు(శనివారం) ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అన్ని ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
'భోగాపురం' నుంచి ఏయిరిండియా కొత్త షెడ్యూల్- ఏ నగరానికి ఎప్పుడు..!!
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి లో ఏర్పాట్లు చేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులను వినియోగించనున్నందున రవాణా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఇప్పటికే అధికారుల నుంచి సమాచారం అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలు సాధారణ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని వెల్లడించారు. విమానాశ్రయం ప్రారంభం వేళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందు కోసం జనం తరలింపు కోసం ఆర్టీసీ తో పాటుగా ప్రయివేటు విద్యా సంస్థల బస్సులను వినియోగిస్తున్నారు.
'భోగాపురం' ప్రారంభం వేళ కొత్త రికార్డులు - ప్రధాని మోదీ కోసం ఇలా..!!
దీంతో.. విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు. భోగాపురం ప్రారంభోత్సవం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహణ కు నిర్ణయించింది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ భోగాపురం ప్రారంభం వేళ.. కొత్త రికార్డులు నెలకొల్పేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 15 వేల మందితో ప్రధానికి ఆహ్వాన సమయంలో ప్రత్యేకంగా 13 వేల మంది గిరిజన కళా కారులతో థింసా నృత్య ప్రదర్శన.. రెండు లక్షల మంది తో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో 20 నిమిషాల పాటు ప్రధానికి స్వాగతం..రోడ్ షో ఉంటాయి. ఇందు కోసం ప్రభుత్వం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.