ఏపీలో ఓటు -హైదరాబాద్‌లో ఉద్యోగం.. SIRలో నమోదు ఎక్కడ.. ఎలా..!?

SIR. ప్రత్యేక సమగ్ర సవరణ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ సర్ ప్రక్రియ వేళ కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. దరఖాస్తుల పంపిణీ నుంచి పూర్తి చేసే వరకు ఎన్నో డౌట్లు ఓటర్లను వెంటాడుతున్నాయి. సిబ్బంది వద్ద సమాధానాలు లేవు. 2002 ముందు ఓటు వివరాలు ఇక్కడ కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆందోళన వద్దని చెబుతున్నా.. సిబ్బంది లో అవగాహన లేమి.. ఓటర్లలో అందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగం కోసం ఉంటూ ఏపీలో ఓటు ఉన్న వారిలోనూ కొత్త సందేహాలు మొదలయ్యాయి.

Advertisement

సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయాలి. ఈసీ మార్గదర్శకాల మేరకు బీఎల్వోలు ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు సందర్శించాలి. ప్రతీ ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారు. ఆ ఫారాలను ఎలా నింపాలో వారు వివరంగా చెబుతారు. బీఎల్వోలు ఇచ్చిన రెండు ఫారాలను నింపిన తరువాత ఒకటి వారు తీసుకొని.. రెండో ఫారాన్ని రశీదుగా మనకు అందజేస్తారు. ఒకవేళ బీఎల్వోలు ఇంటికి వచ్చిన సమయంలో ఓటరు లేకపోతే కుటుంబంలో మేజర్ అయిన సభ్యుడికి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు. అయితే, ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటూ, ఏపీలో ఓటు ఉన్నవారికి సర్ లో నమోదు ఎక్కడ అనే అంశం పైన ఈసీ స్పష్టత ఇస్తోంది. ఒక వ్యక్తికి ఒకేచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి. హైదరాబాద్‌లో ఓటు నమోదు చేసుకోవాలంటే.. ముందుగా ఏపీలో ఓటును రద్దు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

ఎన్నికల సంఘం స్పష్టత

కాగా, తెలంగాణలో ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా ఆధారంగా ఫారం-6 లేదా అవసరమైన దరఖాస్తు ప్రక్రియ ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో ఓటు ఉండి చిరునామా మాత్రమే మారితే ఫారం-8 ద్వారా అడ్రస్ మార్పు చేసుకోవాలి. ఏపీలో ఓటరుగా ఉండి.. ఇక్కడ సర్ లో పేరు నమోదు చేసుకోవటానికి సాధ్యం కాదని స్పష్టత ఇస్తున్నారు. అదే విధంగా కుటుంబంలోని ఒక ఓటరు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఆ వ్యక్తి ఎన్యుమరేషన్ పత్రాన్ని ఆ కుటుంబ పెద్దకు అందిస్తారు. ఓటరు తరపున ఆ ఇంటి పెద్ద ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి సంతకం చేసి బీఎల్వోకు అందించాలి. ఒకవేళ ఓటరు విదేశాల్లో ఉంటే.. ఆ వ్యక్తి వివరాలు ఆ కుటుంబం పెద్ద ఎన్యూమరేషన్ ఫామ్ లో నింపి సంతకం చేయొచ్చు. ఇక.. సర్ ప్రక్రియలో ఆధారం కార్డు తప్పని సరి కాదని ఈసీ తేల్చి చెప్పింది. అదే విధంగా సర్ పక్రియ తరువాత కొత్తగా నమోదు చేసుకునే వారికి ఓటు కల్పిస్తామని వెల్లడించింది.

English Summary

SIR enumeration process is facing widespread technical, and language-related challenges, causing inconvenience to both voters and election officials