అత్యుత్సాహం- కిందపడ్డ వైఎస్ జగన్: కిర్లంపూడిలో ముద్రగడ పాడె మోసిన జగన్, ఇతర నేతలు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటనలో గందరగోళం చెలరేగింది. ఆయనను చూసేందుకు, స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఊహించని రీతిలో భారీ సంఖ్యలో తరలిరావడంతో అక్కడ ఒక్కసారిగా అయోమయ పరిస్థితి నెలకొంది. భీమవరం పర్యటనకు విచ్చేసిన జగన్‌ను చుట్టుముట్టేందుకు అభిమానులు తీవ్రంగా పోటీపడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగబడ్డారు.

Advertisement

ఈ క్రమంలో స్థానిక భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని దాటుకుని అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. జగన్‌కు అత్యంత సమీపంలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడం వ్యక్తిగత భద్రతా సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. జగన్ చుట్టూ రక్షణ వలయంగా ఉండేందుకు వారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Advertisement

వేదిక మీది నుంచి కిందికి దిగే సమయంలో తోపులాట చోటు చేసుకోవడంతో జగన్ ఒక్కసారిగా ముందుకు తూలి కింద పడ్డారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆయనను పట్టుకుని పైకి లేపారు. భద్రత సిబ్బంది అప్పిరెడ్డిని సహకరించారు. జగన్ ను ఫొటోలు తీయడానికి కెమెరామెన్లు కూడా అత్యుత్సాహం చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జాక్ పాట్ కు అడుగు దూరంలో టీమిండియా స్టార్- ఇంకొక్క మంచి ఇన్నింగ్ ఆడితే చాలు
Advertisement

పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాయి. జగన్ కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ నిల్చున్నారు. ఈ గందరగోళం మధ్యే ఆయనను సురక్షితంగా బయటికి వెళ్లారు. అదృష్టవశాత్తూ ఈ తోపులాటలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేద. పెద్ద ఎత్తున జనం ఒకరినొకరు బలంగా నెట్టుకున్నప్పటికీ, భద్రతా బలగాల సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.

వైఎస్ఆర్సీపీకి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయంగా ఎంతో కీలకం. భీమవరంలోని ప్రధాన రహదారులన్నీ జగన్ అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. ఆయనను అత్యంత సమీపం నుంచి చూడాలనే ఉత్సుకతతో జనం వేలాదిగా తరలిరావడం వల్లే ఈ స్థాయి గందరగోళం, తోపులాట ఏర్పడింది.

Advertisement

భీమవరంలో సభ ముగిసిన వెంటనే ఆయన రోడ్డు మార్గంలో హెలికాప్టర్ లో జగ్గంపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్లారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళి అర్పించారు. పాడె మోశారు. ఆ సమయంలో జగన్ వెంట మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. ముద్రగడకు కన్నీటి నివాళి అర్పించారు.

English Summary

Surge of supporters during YS Jagan Bhimavaram visit created brief commotion, Security managed the cordon. He was escorted in and out of the venue safely, and no injuries were reported. The incident highlights crowd management during political events in Andhra Pradesh.