ఇనుపరాడ్లతో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు: తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు


తూర్పుగోదావరి: జిల్లాలోని కాట్రేనికోన మండలంలోని చెయ్యేరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇనుపరాడ్లతో దాడి చేసుకోవడంతో కార్యకర్తలు తీవ్ర గాయాలయ్యాయి. అంగన్వాడీ ఆయా పోస్టు కోసం తలెత్తిన వివాదంలో భాగంగానే టీడీపీలో ఈ రెండు వర్గాలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు! జగన్ నోరు మెదపడు, పవన్ పత్తాలేడు: కేంద్రంపై బాబు ఫైర్

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురికి 108 సిబ్బంది ఘటనా స్థలంలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత వారిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని స్థానిక నేతలు పరామర్శించారు.

Have a great day!
Read more...

English Summary

TDP activists fights each other in east godavari district on Tuesday.