అసెంబ్లీ నియోజకవర్గాలకు TDP కొత్త ఇంఛార్జ్ లు- వాటిల్లో మార్పు వెనుక..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వచ్చే ఎన్నికల కోసం ముందస్తు వ్యూహాలు అమలు చేస్తున్నారు. వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అటు వైసీపీ సైతం కూటమి టార్గెట్ గా కొత్త ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించింది. అదే విధంగా పలు చోట్ల మార్పులు చేస్తోంది. తాజా కసరత్తు వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.

Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మిత్రపక్షాలు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం.. మిత్రపక్ష పార్టీలతో సమన్వయం బాధ్యతలను వారికి అప్పగించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జ్ లను నియమించాలని నిర్ణయించారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఈ బాధ్యతలను కేటాయిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గ టీడీపీ కొత్త ఇంఛార్జ్ గా జేబీ శ్రీనివాస్ కు బాధ్యతలు కేటాయించారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. సుగుణమ్మ కు నామినేటెడ్ పదవి దక్కటంతో కొత్తగా శ్రీనివాస్ ను నియమించారు.

Advertisement

క్షేత్ర స్థాయిలో బలోపేతమే లక్ష్యంగా

అదే విధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని ఇంఛార్జ్‌గా నియమించారు. ఆమె 1999, 2014 లలో ఇదే నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి క్రియాశీలకంగా పనిచేశారు. ప్రస్తుతం అక్కడ జనసేన నుంచి పంతం నానాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా.. పెండింగ్‌లో ఉన్న పలు నియోజకవర్గలకు కొత్త ఇన్‌చార్జ్‌ల ఎంపికపై అధినేత కసరత్తు చేస్తున్నారు. అలాగే, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతన ఇన్‌చార్జ్‌లను నియమించనున్నారు. విశాఖపట్నం నార్త్, ఎచ్చెర్ల, పి. గన్నవరం, అనపర్తి, అవనిగడ్డ, విజయ వాడ వెస్ట్, తంబళ్లపల్లి, పిఠాపురం, కైకలూరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించనున్నారు. అదే విధంగా వివాదాస్పదంగా మారి.. వైఖరి మార్చుకోని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ కొత్త ఇంఛార్జ్ లను నియమించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారంజ

English Summary

TDP leader ship appoint new in charges for other parties representing Constituencies across the state