వైసీపీ ట్రాప్‌లో పడొద్దు- టీడీపీ అధిష్టానం అలర్ట్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రెండు పార్టీల కేడర్ ఈ సవాళ్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల వేళ టీడీపీ అధి నాయకత్వం అలర్ట్ అయింది. పార్టీ ఎమ్మెల్యేలు.. నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ట్రాప్ లో పడద్దని సూచించింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్దేశించింది.

Advertisement

ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకీ మారుతోంది. వైసీపీ వర్సస్ కూటమి అన్నట్లుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి. నియోజకవర్గాల్లో నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగు తోంది. ఉద్రిక్తతలు.. ఘర్షణలకు కారణంగా మారుతోంది. ఈ సమయంలోనే టీడీపీ నాయకత్వం స్పందించింది. పార్టీ నేతలుకు కీలక దిశా నిర్దేశం చేసింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని... వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది.. కావాలని రెచ్చగొట్టి ట్రాప్‌లోకి లాగుతోందని అప్రమత్తం చేసింది. ఆ ట్రాప్‌లో పడొద్దు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులపైనే దృష్టి సారించండంటూ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కీలక సూచనలు చేసింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు, వైసీపీ నేతలకు నడుమ కొనసాగుతున్న సవాళ్లు సమస్యగా మారుతున్నాయి.

Advertisement

తాజా పరిణామాలతో అప్రమత్తం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మధ్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైసీపీ నేత గంగుల బిజేంద్రరెడ్డి నడుమ ఇటీవల తీవ్రస్థాయిలో సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదేబాటలో చాలా మంది టీడీపీ నాయకులు నడుస్తున్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. పలువురు ఎమ్మెల్యేలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైసీపీ విమర్శలు, దుష్ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టాలని, పరస్పరం సవాళ్లు విసురుకునే వరకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తేల్చిచెప్పినట్లు సమాచారం.

English Summary

TDP leadership has instructed party leaders and cadre not to fall into the YSRCP’s trap by issuing public challenges or provocative statements