పోలవరం ప్రాజెక్ట్ కు నా మనుమడు దేవాన్ష్ ను ఇందుకోసమే తీసుకువచ్చా:సిఎం చంద్రబాబు


పశ్చిమ గోదావరి:రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ ప్రాజెక్ట్ ను తప్పనిసరిగా చూడాలని సిఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు చూస్తే ఒక అవగాహన వస్తుందని...అందువల్లే నిర్మాణ సమయంలో చూడాల్సిందిగా ప్రజలకు పిలుపు ఇస్తున్నానని చెప్పారు. అందుకే తన మనుమడు దేవాన్ష్ ను కూడా పోలవరం ప్రాజెక్ట్ కు తీసుకువచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు కూడా భాగస్వాములైతే, భవిష్యత్తులో వారికొక స్ఫూర్తి, ఆలోచన ఉంటుందన్నారు. ఆ ఉద్దేశ్యంతోని దేవాన్షును తీసుకురావడం జరిగిందన్నారు.

పొలవరం ఒక చరిత్ర అని, ఈ చరిత్రలో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి భాగస్వాములు కావాలని చంద్రబాబు హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. ఇదిలావుండగా

పోలవరం గ్యాలరీ వాక్‌లో పాల్గొనడం తన పూర్వజన్మసుకృతమని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం సీఎం చంద్రబాబు గ్యాలరీ వాక్‌ప్రారంభోత్సవం సందర్భంగా సీఎంతో పాటు మంత్రి లోకేష్ గ్యాలరీ వాక్ చేశారు.

అనంతరం ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తనతో పాటు దేవాన్ష్ కూడా గ్యాలరీలో నడిచాడని...దేవాన్ష్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని చెప్పారు. బ్రాహ్మణి, అమ్మ, నాన్న, తాను కలిసి నడిచామని...దేవాన్ష్‌ని ఎక్కడా ఎత్తుకోలేదని అన్నారు. పోలవరంపై ప్రతిపక్షాల విమర్శల్లో పస లేదని ప్రాజెక్టు చూస్తే తెలిసిపోతుందని మంత్రి తెలిపారు. వాళ్లు విమర్శలు చేసేది కేవలం రాజకీయం కోసమే అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగార్జునసాగర్‌కు నెహ్రూ శంకుస్థాపన చేస్తే...ఇందిరాగాంధీ గ్యాలరీ వాక్‌ చేశారని గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్‌కు చంద్రబాబే శంకుస్థాపన చేసి... చంద్రబాబే గ్యాలరీ వాక్‌ చేయడం విశేషమని లోకేష్ చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుని సిఎం చంద్రబాబు 72 సార్లు వర్చువల్ రివ్యూ చేశారన్నారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ-వైసీపీ నేతల విమర్శల్ని ఎవరూ పట్టించుకోరని...డెల్టా రైతులనడిగితే పోలవరం, పట్టిసీమ విలువ ఏంటో చెబుతారని మంత్రి లోకేష్‌ అన్నారు.

Have a great day!
Read more...

English Summary

Amaravathi: AP C M Chandrababu has called to the people of Andhra Pradesh state to visit the Polavaram project. CM Chandrababu wanted everyone to see this project once. CM Chandrababu said that hence he was brought his grandson Devansh to the Polavaram project.