తిరుమల గిరుల్లో భక్తుల కోసం కొత్తగా - టీటీడీ తాజా ఒప్పందం..!!

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నిన్నటి వరకూ కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు నిండిపోయి ఉన్నాయి. తిరిగి ఈ నెల 29వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా రద్దీ మళ్లీ పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.
సుమారు రూ.12.97 కోట్లతో ఈ నిర్ణయం అమలుకు నిర్ణయించింది.

Advertisement

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు పండించే స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీవారి అవసరాల కోసం గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి వీటిని కొనుగోలు చేయాలని డిసైడ్ అయింది. దాదాపు రూ.12.97 కోట్లతో నాణ్యమైన సరకులు తీసుకునేందుకు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. అదే విధంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సైతం ఈ స్వచ్ఛమైన గిరిజన ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం తిరుమలలో ఓ జీసీసీ రిటైల్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఏడాది పాటు నామినేషన్ పద్ధతిలో జీసీసీ నుంచి ఈ సరకులను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. మార్కెట్లో దొరికే ఇతర బ్రాండ్లతో పోలిస్తే జీసీసీ అందించే ఇన్‌స్టంట్ కాఫీ పొడి ధర కాస్త ఎక్కువ. అయినా టీటీడీ బోర్డు దీనికే మొగ్గుచూపింది.

Advertisement
బోండా ఉమా వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, వాట్ నెక్స్ట్...!!

టీటీడీ తాజా నిర్ణయాలతో

తిరుమలకు వచ్చే భక్తులకు జీసీసీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు తిరుమలలో జీసీసీకి ఒక సెల్లింగ్ పాయింట్‌ను కేటాయించింది. ఇందు కోసం రెండో న్యూ సత్రం దగ్గర (గతంలో దొడ్ల డెయిరీ ఉన్న స్థలంలో) 144 చదరపు అడుగుల (12X12) విస్తీర్ణంలో ఐరన్ షీట్ రూఫింగ్‌తో ఈ ప్రత్యేక దుకాణం అందుబాటులోకి రానుంది. ఇక్కడ గిరిజనులు సేకరించిన స్వచ్ఛమైన తేనె, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు తదితర జీసీసీ ఉత్పత్తులను భక్తులకు విక్రయిస్తారు. కేటాయింపు విషయంలో టీటీడీ కొన్ని కఠిన నిబంధనలు విధించింది. తేనె, కుంకుడుకాయల పొడి, ఎండుమిర్చి తదితర వస్తువులను నామినేషన్ పద్ధతిలో తీసుకోవాలని కమిటీ సూచించింది. కుంకుమ పొడి, కారం, పసుపు వంటి వాటిని తగ్గింపు ధరల పైన అందుబాటులోకి తేవాలని చర్చలు జరుగుతున్నాయి.

English Summary

TTD decided to procure pure forest produce cultivated by Araku Valley tribals through the GCC to meet the requirements of Srivaru