తిరుమలకు వచ్చే భక్తులకు బిగ్ అప్డేట్ - ఈ తేదీల్లో సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు..!!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు నిత్యం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. గత కొన్ని రోజులు నుంచి ఇదే పరిస్థితి ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి ఉంటున్నాయి. మాడ వీధులే కాదు... తిరుమలలోని అన్ని వీధులూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా, అధిక మాసం కారణంగా ఈ ఏడాది రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ లో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది.

Advertisement

తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేసారు. కాగా, సెప్టెంబర్ 15 నుండి 23 వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసారు.

Advertisement
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!

భక్తులకు టీటీడీ కీలక సూచనలు

సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అదే విధంగా అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్స వాలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ అంకురా ర్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం. 16వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం నిర్వహించనున్నారు. అదే విధంగా సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ ఉండనుంది.

Advertisement
TTD: మూడు దశాబ్దాల విధానానికి స్వస్తి, కొత్త సంస్కరణలు - ఇక నుంచి..!!

కాగా, 18న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవ ఉంటుందని అధికారులు వెల్లడించారు. 19న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం, 20న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ ఉంటుంది. 21వ తేదీన ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం నిర్వహించనున్నారు. 22న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ ఉంటుంది. 23న ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

English Summary

TTD cancelled Arjitha Sevas and Special darshans during Salikatla Brahmotsavams from September 15-24