TTD: మూడు దశాబ్దాల విధానానికి స్వస్తి, కొత్త సంస్కరణలు - ఇక నుంచి..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శుక్రవారం మొదలయిన భక్తుల రద్దీ సోమవారం కూడా కంటిన్యూ అవుతుంది. ఈ నెలాఖరు వరకు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. కాగా.. టీటీడీ పాలక వర్గం సంస్కరణల అమల్లో భాగంగా మూడు దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న పాత ఎకౌంటింగ్‌ విధానానికి ఆధునిక రూపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

టీటీడీ కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటికే భక్తులకు వేగంగా దర్శనం అందే విధంగా క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ విధానం కొనసాగిస్తోంది. అదే విధంగా వసతి గదుల కేటాయింపు విషయంలోనూ సాంకేతికతను వినియోగించుకోవాలని సేవలను పెంపొందించే విధంగా కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక.. ఇప్పుడు మూడు దశాబ్దాల కాలంగా ఉన్న ఎకౌంటింగ్ విధానంలో సంస్కరణలను అమలు చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఎకౌంటింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారత చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సంస్థ (ఐసీఏఐ) సమగ్ర అధ్యయనం చేపట్టింది. తాజా అవసరాలకు అనుగుణంగా ఒక అకౌంటింగ్‌ మాన్యువల్‌ను ఐసీఏఐ రూపొందించి అందజేయనుంది. ఇప్పటికే ఐసీఏఐకి చెందిన అకౌంటింగ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రాథమిక అధ్యయనం ప్రారంభించింది. ప్రస్తుతం టీటీడీలో ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) ఆధారిత సమగ్ర అకౌంటింగ్‌ వ్యవస్థ అమలులో ఉంది. ఈ వ్యవస్థను ఆధునికీకరించే లక్ష్యంతో ఈ కసరత్తు కొనసాగుతోంది.

Advertisement
పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!

టీటీడీ తాజా ప్రతిపాదనలు

ఈ నిర్ణయం ద్వారా శ్రీవారి ఆలయానికి వచ్చే విరాళాలు, వివిధ విభాగాల ఆదాయంతో పాటుగా చేస్తున్న ఖర్చులు, ఆస్తుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వివరాలన్నింటినీ పారదర్శకంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత క్రమబద్ధంగా నిర్వహించడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. టీటీడీ వినియోగిస్తున్న ఎకౌంటింగ్‌ మాన్యువల్‌ దాదాపు 30 సంవత్సరాల క్రితం రూపొందించినది. కంపెనీస్‌ యాక్ట్‌లో చోటుచేసుకున్న తాజా మార్పులు, నూతన ఎకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా టీటీడీ ఆర్థిక నియమావళిలో అవసరమైన సవరణలను ఈ కొత్త అధ్యయనం నివేదికలో సూచించనున్నారు. వేగవంతమైన ఆర్థిక నియంత్రణకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా తుది కసరత్తు కొనసాగుతోంది. ఈ విధానం వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని భావిస్తున్నారు.

English Summary

TTD is taking steps to modernize its accounting system, with the Institute of ICAI conducting a comprehensive study to enhance financial management